ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రమే కాదు.. దాని ఆకులు కూడా అమృతమే!
10 July 2026
Jyothi Gadda
నేటి కాలంలో కొత్త రకం పండ్లపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అలాంటి వాటిలో విదేశీ పండు అయిన ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి. ఈ పండు మాత్రమే కాదు, దీని ఆకులు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
దీనిని కృష్ణ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీగజాతి మొక్క. దీని ఆకులు, పండ్ల అద్భుత లక్షణాల గురించి తెలిస్తే…ఎక్కడ కనిపించినా కూడా వదలకుండా తెచ్చుకుని తినేస్తారు..
ఈ పండు లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కృష్ణ ఫలంలో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. అంధత్వాన్ని తగ్గిస్తుంది. కంటి పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగిస్తుంది.
కృష్ణ ఫలంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. తరచూ కృష్ణ ఫలం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. పాషన్ ఫ్రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అన్నారు.
ఫ్యాషన్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని గుణాలు రక్తపోటును నియంత్రిస్తాయి.
పాషన్ ఫ్రూట్ ఆకులో విటమిన్ సి, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని రుజువు చేస్తాయి. ఆకులను కూరగాయలుగా తినవచ్చు.
ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. పాషన్ ఫ్రూట్ ఆకులు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.