ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రెండు కార్ల వద్దకు అర్ధరాత్రి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..