AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Tank Level: వాటర్ ట్యాంక్ నిండిందా? ఫోన్‌లోనే లైవ్ స్టేటస్.. నీళ్లు వృథా కాకుండా మోటారును ఆపే సూపర్ డివైజ్!

Water Tank Level Check: ఫ్లోసెన్సో డివైజ్‌ వాటర్ పంప్‌ను నష్టం నుండి కూడా కాపాడుతుంది. ఒక వేళ వాటర్ పంప్‌కు నీటి సరఫరా అందకపోయినా అది నడుస్తూనే ఉంటే పాడైపోవచ్చు. ఫ్లోసెన్సోలో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. అదేమిటంటే పంప్ ఆన్‌లో ఉండి, నీటి సరఫరా లేనప్పుడు అది వాటర్ పంప్‌ను ఆపివేస్తుంది.

Water Tank Level: వాటర్ ట్యాంక్ నిండిందా? ఫోన్‌లోనే లైవ్ స్టేటస్.. నీళ్లు వృథా కాకుండా మోటారును ఆపే సూపర్ డివైజ్!
Water Tank Level Check
Subhash Goud
|

Updated on: Jul 10, 2026 | 12:21 PM

Share

Water Tank Level Check: దేశంలోని దాదాపు చాలా ఇళ్ల పైకప్పులపై నీటి ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల నీటి మట్టాన్ని తనిఖీ చేయడం కష్టంగా ఉంటుంది. మార్కెట్లో ఒక పరికరం అందుబాటులో ఉంది. అది మీ మొబైల్ ఫోన్‌లో ట్యాంక్‌లో ఎంత నీరు ఉందో చూసేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే మోటారును లేదా వాటర్ పంప్‌ను కూడా ఆటోమేటిక్‌గా నియంత్రించగలదు.

మార్కెట్లో ఫ్లోసెన్సో ప్రో అనే స్మార్ట్ గాడ్జెట్ రూ.10,000 ధరకు అందుబాటులో ఉంది. ఇది మొబైల్ ద్వారా నీటి ట్యాంకులు, నీటి పంపులను రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఫ్లోసెన్సో అనేది ఐఓటి ఆధారిత నీటి మట్ట నియంత్రకం. అతి తక్కువ విద్యుత్ వినియోగించే ఈ పరికరాన్ని ట్యాంక్‌పై అమర్చి, ఆపై ఒక స్మార్ట్ స్విచ్‌కు అనుసంధానిస్తారు. ట్యాంక్ నిండిన వెంటనే ఇది నీటి పంపును స్వయంచాలకంగా ఆపివేస్తుంది.

ఇవి కూడా చదవండి

యాప్ సహాయంతో..

ఫ్లోసెన్సో నీటి మట్టాన్ని తనిఖీ చేయడానికి ఒక యాప్‌ను కూడా అందిస్తుంది. దీని ద్వారా మీ ఇంటి పైకప్పుపై ఉన్న నీటి ట్యాంక్ ఎంత నిండిందో మీరు చూడవచ్చు. నీటి మట్టం శాతాలలో మొబైల్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫ్లోసెన్సో యాప్ ద్వారా మీరు వాటర్ పంప్ మోటార్‌ను కూడా నియంత్రించవచ్చు. మీరు వాటర్ పంప్‌ను రిమోట్‌గా ఆన్, ఆఫ్ చేయవచ్చు. అలాగే వాటర్ పంప్‌ను షెడ్యూల్ కూడా చేయవచ్చు.

మోటారు కూడా ఆఫ్‌ చేస్తుంది:

ఫ్లోసెన్సో డివైజ్‌ వాటర్ పంప్‌ను నష్టం నుండి కూడా కాపాడుతుంది. ఒక వేళ వాటర్ పంప్‌కు నీటి సరఫరా అందకపోయినా అది నడుస్తూనే ఉంటే పాడైపోవచ్చు. ఫ్లోసెన్సోలో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. అదేమిటంటే పంప్ ఆన్‌లో ఉండి, నీటి సరఫరా లేనప్పుడు అది వాటర్ పంప్‌ను ఆపివేస్తుంది.

Flosenso

Flosenso

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us