AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేరేడు పండ్లను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? జామూన్ కాదు.. దీన్ని వెనక పెద్ద కథే ఉందిగా..

వర్షాకాలం వస్తూ వస్తూనే మార్కెట్లోకి నల్లటి ముత్యాల్లాంటి పండ్లను తీసుకొస్తుంది. అవే మనకు ఎంతో ఇష్టమైన నేరేడు పండ్లు. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పండును ఇంగ్లీషులో ఏమంటారో చాలా తక్కువ మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికున్న డిమాండ్ ఏంటి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాల గురించి తెలుసుకుందాం..

నేరేడు పండ్లను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? జామూన్ కాదు.. దీన్ని వెనక పెద్ద కథే ఉందిగా..
What Is Jamun Called In English
Krishna S
|

Updated on: Jul 10, 2026 | 12:17 PM

Share

వర్షాకాలంలో దొరికే పండ్లలో నేరేడు పండ్లకు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. తీపి, వగరు, పులుపుల కలయికతో ఉండే ఈ పండును చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం రుచిలోనే కాదు.. ఆయుర్వేదం, యూనానీ వైద్య విధానాల్లో వేల సంవత్సరాల నుండి నేరేడును ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే మనకు ఎంతో ఇష్టమైన ఈ నేరేడు పండును ఇంగ్లీషులో ఏమంటారో చాలా తక్కువ మందికి తెలుసు. దీని పోషక విలువలు, శాస్త్రీయ నామం, కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేరేడు పండు.. వివిధ రకాల పేర్లు

నేరేడును ఇంగ్లీషులో జావా ప్లమ్ అని పిలుస్తారు. అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని బ్లాక్ ప్లమ్ లేదా మలబార్ ప్లమ్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సిజీజియం క్యుమిని.

నేరేడు పండులోని అద్భుతమైన పోషకాలు

ప్రముఖ హెల్త్ రీసెర్చ్ జర్నల్ పబ్‌మెడ్ ప్రకారం.. నేరేడు పండులో శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

విటమిన్లు – మినరల్స్: ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్.

యాంటీ ఆక్సిడెంట్లు: ఇందులో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

కేవలం పండే కాకుండా నేరేడు గింజలు, ఆకులలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే బయోయాక్టివ్ ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.

నేరేడుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు

నిజమైన బ్లాక్‌బెర్రీ కాదు: చాలా మంది నేరేడు పండును ఇండియన్ బ్లాక్‌బెర్రీ అని పిలుస్తారు. కానీ నిజానికి అసలైన బ్లాక్‌బెర్రీ లేదా బ్లూబెర్రీ ఫ్యామిలీకి చెందిన మొక్కలతో నేరేడుకు ఎలాంటి సంబంధం లేదు.

కుటుంబాల తేడా: నేరేడు పండు మిర్టేసి కుటుంబానికి చెందింది. కానీ ఒరిజినల్ బ్లాక్‌బెర్రీ రోజేసి కుటుంబానికి చెందినది. దీని నల్లటి, ముదురు రంగు కారణంగానే దీనికి ఇండియన్ బ్లాక్‌బెర్రీ అనే పేరు వచ్చింది.

జావా ప్లమ్ అని ఎందుకు అంటారు?: ఇండోనేషియాలోని జావా దీవిలో ఈ పండును భారీ ఎత్తున పండిస్తారు. బ్రిటీష్ మరియు యూరోపియన్ వ్యాపారులు ఆసియా-భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు, జావా ప్రాంతంలో ఈ పండును ఎక్కువగా గమనించడం వల్ల దీనికి జావా ప్లమ్ అనే పేరు స్థిరపడింది.

నేరేడు పండుతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ నియంత్రణ: నేరేడు పండులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే మధుమేహ బాధితులకు ఇది అమృతంతో సమానం.

ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ: ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ మూలకాలు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి.

వాపుల నివారణ: ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వచ్చే వాపులను, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

మంచి జీర్ణక్రియ – రోగనిరోధక శక్తి: నేరేడు పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ నల్లటి ముత్యాన్ని ఈ సీజన్ లో అస్సలు మిస్ అవ్వకండి.

Follow Us