ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు, ఆపై ఇరాన్‌పై అమెరికా ముందస్తు దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్తగా కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన పక్కా నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్'కు అందించిందని అమెరికా మీడియా వెల్లడించింది.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు, ఆపై ఇరాన్‌పై అమెరికా ముందస్తు దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్తగా కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన పక్కా నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’కు అందించిందని అమెరికా మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఈ హత్య కుట్ర వార్త బయటకు రావడం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.
ఇరాన్ ఆరోపిత హత్యాయత్న ప్రణాళికకు సంబంధించిన తాజా హెచ్చరిక ఈ వారంలోనే వచ్చిందని సీఎన్ఎన్ (CNN) పేర్కొంది. అయితే, ఇరాన్ నుండి ట్రంప్‌నకు ముప్పు ఉందనే వార్తలు గత కొన్ని వారాలుగా అమెరికా నిఘా వర్గాలకు తెలుసునని, కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు అందించిన సమాచారం చాలా ఖచ్చితమైనదని, ఒక నిర్దిష్ట కుట్రకు సంబంధించినదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను మరింత తీవ్రం చేయాలా? లేక కాల్పుల విరమణ ఒప్పందాన్నే కొనసాగించాలా? అని ట్రంప్ సందిగ్ధంలో ఉన్న సమయంలో.. ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికే ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని తెరపైకి తెచ్చిందా అనే ఆందోళనను కొందరు అమెరికా అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ మొదటి పదవీకాలంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అగ్రశ్రేణి జనరల్ ఖాస్సెమ్ సులేమానీని అమెరికా హతమార్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చాలా రోజులుగా బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఇటీవల ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో కూడా ఇరాన్ సంతాపకులు “మేము ట్రంప్‌ను చంపుతాము” అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నాటో (NATO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అంకారాలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నన్ను అంతం చేయాలనుకుంటున్నారు. నేను వాళ్ళ హిట్‌లిస్ట్‌లో ఉన్నాను” అని స్వయంగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించడంపై భిన్నాభిప్రాయాల కారణంగా ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మరి కొన్నిరోజులు సైనిక దాడుల కోసం నెతన్యాహు పట్టుబట్టగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ వెనక్కి తగ్గారు. దీనివల్ల గత నెలలోనే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్-నెతన్యాహు మధ్య సంబంధాలు మళ్లీ మెరుగవుతున్నట్లు కనిపిస్తోంది. గురువారం (జూలై 09) వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని, వ్యూహాత్మక సమన్వయంపై చర్చించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపట్టిన తాజా సైనిక కార్యకలాపాలను ట్రంప్ నెతన్యాహుకు వివరించారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారంతో గల్ఫ్ రీజియన్‌లో ఏ క్షణమైనా మళ్లీ యుద్ధం ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
