Tollywood : ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు నవీన్ ఓలేటి. చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోలకు స్నేహితుడిగా నటించి మెప్పించాడు. బుల్లితెరపై అనేక సీరియల్స్ ద్వారా అలరించాడు. ఆయన భార్య మధురిమ కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ దంపతులు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు వీరి పెద్ద కుమార్తె ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నటుడు నవీన్ ఓలేటి ఒకరు. ఆయన పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ అతడి ముఖం చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. కానీ, వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో ఆయన స్నేహితుడిగా, అలాగే ‘తొలివలపు’ చిత్రంలో హీరో అన్నయ్యగా నటించి మెప్పించింది ఈయనే. అలాగే తరుణ్, శ్రియా కలిసి నటించిన నువ్వే నువ్వే చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. సినిమాలకంటే ముందు బుల్లితెరపై నవీన్ ఓలేటి ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సీరియల్స్ చేసిన ఆయన.. పద్మవ్యూహం’, ‘నాన్న’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆయన పోషించిన పాత్రలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వెండితెరపై దాదాపు 100కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తూ బిజీ అయ్యారు. ‘నువ్వే నువ్వే’, ‘ప్రేమించుకుందాం రా’, ‘విక్రమార్కుడు’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.
ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..
అయితే, నవీన్ ఓలేటి వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయన భార్య కూడా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె పేరు మధురిమ. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘ధళం’ సినిమాతో ఆమె పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాలో రాజీవ్ కనకాల భార్యగా నటించి మధురిమ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశేషమేమిటంటే, అదే విక్రమార్కుడు సినిమాలో నవీన్ ఓలేటి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో మెరిశారు.
ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..
ఇలా వెండితెరపైన, బుల్లితెరపైన ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఈ నటీనటుల జంట ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటోంది. నవీన్ ఓలేటి, మధురిమ దంపతులు ప్రస్తుతం తమ పిల్లలతో కలిసి అమెరికా (USA)లో స్థిరపడి, అక్కడ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ దంపతుల పెద్ద కుమార్తె మనవి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా రాణించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
నవీన్ ఓలేటీ కూతురు..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
