AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరే..! కింగ్ కోబ్రాను బ్యూటీ క్వీన్‌గా మార్చేశాడు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామంది భయపడతారు. అలాంటి అత్యంత విషపూరితమైన పామును ఓ హెయిర్ స్టైలిస్ట్ సెలూన్‌లో కస్టమర్‌లా చూసుకుంటూ హెయిర్ స్టైల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: అరే..! కింగ్ కోబ్రాను బ్యూటీ క్వీన్‌గా మార్చేశాడు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..!
King Cobra Hair Extension
Balaraju Goud
|

Updated on: Jul 09, 2026 | 4:30 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామంది భయపడతారు. అలాంటి అత్యంత విషపూరితమైన పామును ఓ హెయిర్ స్టైలిస్ట్ సెలూన్‌లో కస్టమర్‌లా చూసుకుంటూ హెయిర్ స్టైల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో భారీ కింగ్ కోబ్రా సెలూన్ కుర్చీపై ప్రశాంతంగా చుట్టలు చుట్టుకుని కూర్చుని కనిపిస్తుంది. దాని తలపై పొడవాటి హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అమర్చినట్లు చూపించారు. అనంతరం హెయిర్ స్టైలిస్ట్ వాటిని జాగ్రత్తగా వాష్‌బేసిన్ వద్ద కడిగి, రంగు వేసి, బ్లో డ్రై చేసి, దువ్వుతూ కనిపించాడు. ఈ మొత్తం సమయంలో పాము ప్రశాంతంగా ఉండటం వీడియోలో మరింత ఆసక్తిని కలిగించింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ కార్లోస్ అటిల్లా. ఆయన సోషల్ మీడియాలో హెయిర్ స్టైలింగ్ వీడియోలతో మంచి గుర్తింపు పొందారు. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో అమెరికాలోని ప్రముఖ హెయిర్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరిగా పేర్కొంటారు. ఈ వినూత్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా, ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని సరదాగా తీసుకుని ఫన్నీ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇంత ప్రమాదకరమైన పాముతో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సురక్షితం అని ప్రశ్నిస్తున్నారు. ఒక యూజర్ “అన్నా.. ఇతనే నీ చివరి క్లయింట్ కాకూడదు” అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ “ఇది చూస్తుంటేనే భయంగా ఉంది.. పైగా పామును కౌగిలించుకోవడం మరింత షాకింగ్” అని రాశాడు. ఇంకొకరు “ఇలాంటి క్లయింట్లకు దూరంగా ఉండటం మంచిది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మరొకరు “అరే.. మా బాస్ అక్కడ ఏం చేస్తున్నాడు?” అంటూ హాస్యాస్పదంగా స్పందించారు.

అయితే ఈ వీడియోను చూసే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి వీడియోల్లో విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ లేదా ఇతర సృజనాత్మక పద్ధతులు ఉపయోగించి ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఎలాంటి విన్యాసాలనూ అనుకరించకుండా, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us