Akkineni Akhil : అఖిల్ ప్రాంక్ కాల్ చేసింది ఈ జబర్దస్త్ కమెడియన్‌కే .. ఒక ఆట ఆడుకున్నాడుగా..
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లెనిన్ సినిమా పైనే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎట్టకేలకు లెనిన్ సినిమాతో అది నెరవేరిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. తొలిసారి అఖిల్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. మాస్ యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కిన లెనిన్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. లెనిన్ సినిమాకు అఖిల్ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. ప్రతి ఇంటర్వ్యూలో సినిమా పై నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది.
ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది
ఇదిలా ఉంటే విడుదలకు ముందు అఖిల్ గెటప్ శ్రీనుతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ చాల సరదాగా సాగుతుంది. అఖిల్, గెటప్ శ్రీను ఇద్దరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ.. టీ తాగుతూ ఫన్నీ జోక్స్ వేసుకుంటూ ఆ ఇంటర్వ్యూ సాగుతుంది. అయితే అదే ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను ఒక ప్రాంక్ కాల్ చేసి అఖిల్ కు ఇస్తాడు. అఖిల్ మాట్లాడుతున్నా అని చెప్పిన అవతలి వ్యక్తి నమ్మాడు. పైగా నేను నాగార్జునను మాట్లాడుతున్నా అంటూ మిమిక్రీ చేస్తాడు.
ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..
అయితే గెటప్ శ్రీను ప్రాంక్ కాల్ చేసింది ఎవరికో తెలుసా.? అతను ఓ జబర్దస్త్ నటుడు. అతని పేరు జితేందర్. ఇతను జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కామెడీ స్కిట్స్ తో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తుంటాడు. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా.. కాగా ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో అఖిల్ తనకు రాండమ్ కాల్ చేయడంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అఖిల్ కు, గెటప్ శ్రీను కు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేశాడుజితేంద్ర.
ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




