AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.61 వేల ఆదాయం.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే.. సంపాదించిన డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టి, దాని ద్వారా కోటీశ్వరులు అవ్వడం మరొక ఎత్తు. నేటి కాలంలో మార్కెట్లో ఎన్నో పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు అందరూ నమ్మే ఏకైక ప్రభుత్వ సంస్థ పోస్ట్ ఆఫీస్.

నెలకు రూ.61 వేల ఆదాయం.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Post Office Ppf Scheme
Krishna S
|

Updated on: Jul 10, 2026 | 2:15 PM

Share

పోస్ట్ ఆఫీస్ అందించే అత్యంత పాపులర్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఇందులో చిన్న మొత్తంలో పొదుపు చేయడం ప్రారంభించి, దీర్ఘకాలంలో ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పథకం కాబట్టి మీ పెట్టుబడికి నూటికి నూరు శాతం భద్రత ఉంటుంది. ఈ పథకం EEE కేటగిరీ కిందకు వస్తుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం డబ్బుపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఈ ఖాతాలో ఏడాదికి కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1,500,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

నెలకు రూ. 61,000 పైగా ఆదాయం.. కోటీశ్వరులు ఎలా అవ్వాలి?

పీపీఎఫ్ పథకం ప్రాథమిక మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అయితే దీనిని 5 సంవత్సరాల బ్లాక్‌ల చొప్పున ఎంత కాలమైనా పొడిగించుకోవచ్చు. మీరు కోటీశ్వరులు కావడానికి ఇదొక్కటే మార్గం.

ధనవంతులు కావడానికి ప్లాన్ ఇలా ఉండాలి:

రోజువారీ పొదుపు: మీరు రోజుకు సుమారు రూ. 410 పొదుపు చేయగలిగితే, అది నెలకు దాదాపు రూ. 12,500 అవుతుంది.

వడ్డీ రేటు: ప్రస్తుతం పీపీఎఫ్ పై ప్రభుత్వం 7.1శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది (ఇది చక్రవడ్డీ రూపంలో పెరుగుతుంది).

కాలపరిమితి పెంచడం: మీరు 15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకోకుండా, మరో 10 ఏళ్లు ఈ పెట్టుబడిని కొనసాగించాలి.

5 ఏళ్ల తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం

  • మీరు పెట్టుబడి పెట్టే అసలు మొత్తం: రూ. 3,750,000
  • దానిపై మీకు లభించే చక్రవడ్డీ: రూ. 6,558,015
  • మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం నిధి: రూ.10,308,015

ఈ కోటి రూపాయల నిధిని మీరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ లేదా ఇతర మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్స్‌లో తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా.. లేదా పీపీఎఫ్ వడ్డీ లెక్కల ప్రకారం ప్రతి నెలా రూ.61,000 కంటే ఎక్కువ స్థిర ఆదాయాన్ని ఎలాంటి రిస్క్ లేకుండా సొంతం చేసుకోవచ్చు.

ఖాతా ఎవరు తెరవవచ్చు?

భారతీయ పౌరుడైన ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు కూడా ఈ ఖాతాను నిర్వహించవచ్చు. ఒక వ్యక్తికి ఒకే పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంటుంది. మీరు మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లి ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. కాగా దీర్ఘకాలిక లక్ష్యాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్లాన్ చేసేవారికి పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఒక వరం లాంటిది.

Follow Us