AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

I Nobody Movie Review: ‘ఐ, నోబడీ’ సినిమా రివ్యూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాంక్ హైస్ట్ డ్రామా ఎలా ఉంది..?

పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. పైగా సలార్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. దాంతో పాటు వారణాసిలో నటిస్తున్నారు.. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ఐ, నోబడీ’. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.. మరి ఇదెలా ఉందో చూద్దాం..

I Nobody Movie Review: ‘ఐ, నోబడీ’ సినిమా రివ్యూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాంక్ హైస్ట్ డ్రామా ఎలా ఉంది..?
I Nobody Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 1:21 PM

Share

మూవీ రివ్యూ: ఐ, నోబడీ

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హక్కీమ్ షాజహాన్, విజయ రాఘవన్, అశోకన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

సంగీతం: జేక్స్ బిజాయ్

తెలుగు విడుదల: మైత్రి మూవీ మేకర్స్

నిర్మాత: పృథ్వీరాజ్ సుకుమారన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: నిషమ్ బషీర్

పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. పైగా సలార్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. దాంతో పాటు వారణాసిలో నటిస్తున్నారు.. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ఐ, నోబడీ’. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.. మరి ఇదెలా ఉందో చూద్దాం..

కథ:

రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియేట్‌లో ఓ ఉద్యోగి.. ఆయన భార్య మీరా (పార్వతి తిరువోతు) కూడా జాబ్ చేస్తుంటుంది. ఇద్దరు ఆడపిల్లలు (జియా, అమల) చదువుకుంటూ ఉంటారు. భార్య మీరా ఇంటి పనులు, తన ఉద్యోగం, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య మాటలు ఉండవు. ఇలా మౌనంగా సాగిపోతున్న వీళ్ల జీవితంలో ఒక బ్యాంకు దొంగతనం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ రాజీవన్ చుట్టూనే తిరుగుతాయి. అతన్ని నేరస్థుడిగా ముద్రవేసి పోలీసులు తరచూ ఇంటికి వస్తుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పమని మీరా బతిమాలినా అతను మౌనంగానే ఉంటాడు. ఆ దొంగతనంలో రాజీవన్ పాత్ర ఏమిటి? ఒకవేళ తప్పు చేయకపోతే, అన్ని ఆధారాలు తన వైపే ఉన్న పరిస్థితి నుంచి ఒక సామాన్యుడు ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన కథ..

కథనం:

సింపుల్‌గా చెప్పాలంటే ఐ, నోబడీ అనేది బ్యాంక్ హైస్ట్ డ్రామా. సినిమా మొదలైనప్పుడు కథనం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. పాత్రలను, వారి నేపథ్యాన్ని పరిచయం చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. కానీ ఒకసారి కథలో వేగం పుంజుకున్నాక ప్రేక్షకులను పూర్తిగా తనలో లీనం చేసుకుంటుంది. సాధారణంగా ఇలాంటి బ్యాంకు దొంగతనాల సినిమాల్లో ఆ దొంగతనం ఎలా ప్లాన్ చేశారు, దాన్ని ఎలా అమలు చేశారు అనే అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ దర్శకుడు నిస్సామ్ బషీర్ మాత్రం రూట్ మార్చి, అసలు రాజీవన్ మనసులో ఏం జరుగుతోంది, ఈ ఆరోపణల ఊబిలోంచి ఎలాంటి మచ్చ లేకుండా తనను తాను ఎలా కాపాడుకుని బయటపడతాడు అనే కోణంలో స్క్రీన్ ప్లే నడిపించాడు. రాజీవన్ చూడటానికి సామాన్యుడిలాగే కనిపించినా, అతని సూక్ష్మమైన హావభావాలు, చురుకైన ఆలోచనలు చూస్తే ఈ దొంగతనంలో అతనికి ఏదో పెద్ద సంబంధమే ఉందనే ఆసక్తిని దర్శకుడు మొదట్లోనే క్రియేట్ చేశాడు.

కథను సూటిగా చెప్పకుండా ముందు వెనకలకు మారుస్తూ రచయిత సమీర్ అబ్దుల్ రాసుకున్న నాన్ లీనియర్ విధానం మొదటి సగంలో సినిమాపై ఎంతో ఉత్కంఠను, వేగాన్ని పెంచుతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాతే కథనం నెమ్మదించిపోతుంది. దర్శకుడు ప్రతి రహస్యాన్ని ప్రేక్షకులకు అర్థం కావాలనే ఉద్దేశ్యంతో పదే పదే వివరిస్తూ చూపించాడు. దీనివల్ల మనకు ముందే అర్థమైంది కదా ఇక కథను ముందుకు తీసుకువెళ్లొచ్చుగా అనిపిస్తుంది. ఈ ల్యాగ్ వల్ల క్లైమాక్స్‌కు వచ్చేసరికి సినిమా ఇవ్వాల్సిన అసలైన ఇంపాక్ట్ మిస్ అవుతుంది. 2.48 గంటల నిడివి ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. కనీసం ఒక 20 నిమిషాల పాటు సినిమాను తగ్గించి ఉంటే బాగుండేది. ఒక మంచి థ్రిల్లర్‌కు అవసరమైన కొత్తదనం ఉన్నప్పటికీ, ఈ అనవసరమైన సాగదీత వల్ల, క్లైమాక్స్‌లో తడబడటం వల్ల ఈ సినిమా ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయింది.

నటీనటులు:

రాజీవన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన అద్భుతంగా ఉంది. అతనేమీ సూపర్ హీరో కాదు, దెబ్బలు తింటాడు, గాయపడతాడు, కానీ తన వల్ల భార్యాపిల్లలు ఇబ్బంది పడకూడదనే క్లారిటీ ఉన్న ఒక సామాన్యుడు. ఇక మీరా పాత్రలో పార్వతి తిరువోతు ఒదిగిపోయింది. ఆమె కేవలం ఇంటికే పరిమితమైన హౌజ్ వైఫ్‌లా కాకుండా ఇండిపెండెంట్ ఉమెన్‌గా చూపించారు. భర్త తీసుకునే నిర్ణయాలు కుటుంబం మీద ప్రభావం చూపినప్పుడు అతన్ని నిలదీసే దృశ్యాల్లో, అలాగే ఒక భార్యగా, తల్లిగా అద్భుతమైన నటనతో సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ టీం:

జేక్స్ బిజాయ్ సంగీతం చాలా బాగుంది.. అదే సినిమాకు ప్లస్. సినిమాకు దినేష్ పురుషోత్తమన్ అందించిన సినిమాటోగ్రఫీ పెద్ద బలం. ముఖ్యంగా లిఫ్ట్‌లో జరిగే ఫైట్ సీక్వెన్స్, స్లో-మోషన్ ట్రాకింగ్ షాట్స్ అద్భుతంగా వచ్చాయి. దీనికి తోడు నిక్సన్ జార్జ్ సౌండ్ డిజైన్ ఆయా సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. దర్శకుడు నిస్సామ్ బషీర్ ఒక సామాన్యుడి పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పోలీసు అధికారితో ఫుడ్ చైన్ గురించి చెప్పించే సన్నివేశం, అందులో బలహీనుడు బతకాలంటే బలవంతుడిని ఎదిరించాలనే ట్విస్ట్ ను రాసిన విధానం సినిమాకే హైలైట్. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి సెకండాఫ్ నిడివి తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఐ, నోబడీ.. సామాన్యుడి తిరుగుబాటు.. డీసెంట్ బ్యాంక్ హైస్ట్

Follow Us