AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamanna: రాక్ స్టార్ సరసన మిల్కీ బ్యూటీ.. నార్తన్-‏ యశ్ ప్రాజెక్ట్‏లో హీరోయిన్‏గా తమన్నా ?

Narthan-Yash Movie  Update:  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా ద్వారా కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

Tamanna: రాక్ స్టార్ సరసన మిల్కీ బ్యూటీ.. నార్తన్-‏ యశ్ ప్రాజెక్ట్‏లో హీరోయిన్‏గా తమన్నా ?
Tamanna
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 9:14 AM

Share

Narthan-Yash Movie  Update:  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా ద్వారా కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దక్షిణాదితోపాటు.. ఉత్తరాదీలో కూడా యశ్ కు పాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం యశ్.. కేజీఎప్ చాప్టర్ 2 చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దీంతో ఈసారి కూడా మరోసారి రికార్డ్స్ పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ సినిమా తర్వాత తన తదుపరి సినిమాను యశ్.. ముఫ్తీ ఫేమ్ నార్తన్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఇందులో యశ్.. నెవీ అధికారిగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎప్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‏గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే కేజీఎప్ చాప్టర్ 1లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు నార్తన్, యశ్ కాంబోలో రాబోతున్న సినిమాలో తమన్నా కథనాయికగా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో తమన్నా నటిస్తుంది. అలాగే త్య దేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో చేస్తుంది.  ఇవే కాకుండా.. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్‌ తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Also Read: Daare Leda Song: సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ నుంచి దారే లేదా సాంగ్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం అంటున్న నాని..

Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..

Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..