Taapsee: సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ.. ఎట్టకేలకు రీజన్ చెప్పిన బోల్డ్ బ్యూటీ..
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే తాప్సీ, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ ఇష్యూస్ మీద ఈ బ్యూటీ చేసే కమెంట్స్ అప్పుడప్పుడు వివాదాస్పదమవుతుంటాయి కూడా. కానీ కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఈ విషయమం మీదే స్పందించారు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే తాప్సీ, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ ఇష్యూస్ మీద ఈ బ్యూటీ చేసే కమెంట్స్ అప్పుడప్పుడు వివాదాస్పదమవుతుంటాయి కూడా. కానీ కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఈ విషయమం మీదే స్పందించారు.
సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు తాప్సీ పన్ను. తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ.. నార్త్‌లో మాత్రం పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో దూసుకుపోతున్నారు. నటిగానే కాదు నిర్మాతగానూ నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు తాప్సీ పన్ను. సోషల్ ఇష్యూ ద స్పందించటం, తన మీద వచ్చే విమర్శలకు సమాధానం చెప్పటం లాంటివి సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు. కానీ కొద్ది రోజులుగా ఈ బ్యూటీ ఆన్‌లైన్‌కు దూరమయ్యారు.
ప్రజెంట్ షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న డంకీ సినిమాలో నటిస్తున్నారు తాప్సీ. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని ముందు నుంచే చెబుతున్నారు. అందుకే ఎలాంటి డీవియేషన్ లేకుండా క్యారెక్టర్ మీద కాన్సన్‌ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారట ఈ బ్యూటీ.
కొద్ది రోజులుగా తాప్సీకి సంబంధించి సీన్సే రూపొందిస్తుండటంతో సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేసేంత తీరిగ్గా లేనంటున్నారు ఈ బ్యూటీ. ఫస్ట్ టైమ్ షారూఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవటంపై సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు తాప్సీ పన్ను.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




