Jailer Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కావాలయ్యా’ సాంగ్.. ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా?!
రజనీ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు బిగ్ సెలబ్రేషనే. జైలర్ విషయంలో ఈ సెల్రబేషన్స్ కాస్త ఎర్లీగానే మొదలయ్యాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఆన్‌లైన్‌లో వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. రికార్డ్స్ బ్రేక్ చేయటంలోనూ తలైవా నయా రికార్డ్ సెట్ చేశారంటున్నారు ఫ్యాన్స్.

‘కావాలయ్యా’.. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ సాంగే టాప్ ట్రెండింగ్. జైలర్ సినిమాలో రజనీ, తమన్నాల మీద చిత్రీకరించిన ఈ పాట డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. ఒక్క ఇన్‌స్టాలోనే ఈ పాటకు 2 లక్షలకు పైగా రీల్స్ వచ్చాయంటూ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది మూవీ టీమ్.
ఫ్యాన్స్ చేస్తున్న రీల్స్ మాత్రమే కాదు. సెల్రబిటీలు చేస్తున్న రీల్స్, ఏఐలో రీక్రియేట్ చేసిన రీల్స్ కూడా ఆన్‌లైన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
రీల్స్ విషయంలోనే కాదు, వ్యూస్ పరంగానూ కావాలా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రజనీ కెరీర్‌లో హయ్యస్ట్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటి వరకు రెండు వారాల్లో 56 మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేసి, అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది.
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..