Lokesh Kanagaraj: లోకేష్ డ్రీమ్ హీరో అతడేనా..? భారీ సినిమా ప్లాన్ చేస్తోన్న స్టార్ డైరెక్టర్
విక్రమ్ సక్సెస్ తరువాత స్టార్ హీరోలకు కూడా హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు లోకేష్ కనగరాజ్. తమిళ హీరోలు మాత్రమే కాదు తెలుగు, హిందీ స్టార్స్ కూడా ఈ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెంచారు.

విక్రమ్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రివీల్ చేశారు. ఓ స్టార్ హీరోతో డిఫరెంట్ జానర్‌లో సినిమా చేయాలనుందన్నారు లోకేష్. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కథ కూడా చాలా ఏళ్ల కిందట రెడీ చేసుకున్నారట కూడా. విక్రమ్ సక్సెస్ తరువాత స్టార్ హీరోలకు కూడా హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు లోకేష్ కనగరాజ్. తమిళ హీరోలు మాత్రమే కాదు తెలుగు, హిందీ స్టార్స్ కూడా ఈ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెంచారు.
దర్శకుడిగా పరిచయం కాకముందే ఓ భారీ ఫాంటసీ డ్రామాకు కథ సిద్ధం చేసుకున్నారు లోకేష్. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో ఆ రేంజ్ సినిమా చేయడానికి బడ్జెట్ సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ముందు లో బడ్జెట్‌లో చేసే యాక్షన్ డ్రామాలతో దర్శకుడిగా సెటిల్ అయ్యారు. కానీ ఎప్పటికైనా డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలన్న మిషన్‌తోనే వర్క్ చేస్తున్నారు.
తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు లోకేష్. ఇరుంబు కై మాయావి పేరుతో చాలా ఏళ్ల కిందటే ఓ ఫాంటసీ కథను సిద్ధం చేశానని చెప్పారు. ఆల్రెడీ విక్రమ్ సినిమాలో సూర్యను గెస్ట్ రోల్‌లో చూపించిన లోకేష్, అతనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కి హీరో అని కూడా క్లారిటీ ఇచ్చారు. సూర్యతో చేయబోయే సినిమా తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. ఇప్పటి వరకు డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు మాత్రమే చేసిన ఈ డైరెక్టర్, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మాత్రం సూపర్ హీరో ఫిలింగా ప్లాన్ చేస్తున్నారు. సూర్య పక్కా సినిమా ఉంటుందని చెప్పినా.. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.




