Kalki 2898 AD: కొత్త జానర్స్‌లో మూవీస్ చేస్తోన్న రెబల్ స్టార్.. హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోకుండా..
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రాజెక్ట్ కే టీజర్ చూసిన ప్రేక్షకులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి సినిమాతో ఇండియన్ మూవీ మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు ప్రభాస్.
ఈ జనరేషన్‌కు ఫోక్‌లోర్ సినిమాను తిరిగి పరిచయం చేసిన ప్రభాస్, ఇప్పుడు ఇండియన్ సినిమాకు ఓ కొత్త జానర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించిన వింత ప్రపంచాన్ని ఇప్పుడు మన కోసం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రాజెక్ట్ కే టీజర్ చూసిన ప్రేక్షకులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి సినిమాతో ఇండియన్ మూవీ మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు ప్రభాస్. ఆ మూవీ.. మేకింగ్, గ్రాఫిక్స్ పరంగానే కాదు వసూళ్ల పరంగానూ మన సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఆ తరువాత కూడా అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు డార్లింగ్.
రీసెంట్‌గా ఆదిపురుష్‌తో మరోసారి రామకథను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ జనరేషన్‌కు నచ్చేలా, ఇన్నాళ్లు మనం చూసిన రాముడి లుక్‌కు భిన్నంగా కొత్త తరహ రామాయణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నారు డార్లింగ్. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వింత ప్రపంచాన్ని తెలుగు ఆడియన్స్‌కు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న సినిమాకు కల్కి 2898 AD అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో ప్రభాస్, విష్ణు అవతారంగా నటిస్తున్నారన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద డౌట్స్ క్రియేట్ చేసినా.. టీజర్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ కొత్త జానర్‌ను తెర మీద ఆవిష్కరించబోతున్నారు. టీజర్‌లో ప్రభాస్‌తో పాటు లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దీపిక పదుకోన్‌ల లుక్స్ కూడా రివీల్ చేశారు. కీలక పాత్రలో తమిళ నటుడు పశుపతి కనిపించారు. ఓవరాల్‌గా ప్రాజెక్ట్ కే టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించేలా రెడీ అయ్యింది. కానీ ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే మాత్రం 2024 వరకు వెయిట్ చేయాల్సిందే.