Kiara Advani: ఆ విషయంలో నా భర్త సపోర్ట్ ఉంది.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కియారా
తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయంలో భర్త సపోర్ట్ చాలా ఉందంటున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా సత్యప్రేమ్‌కి కథ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కియారా.

రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ, కెరీర్ విషయంలో మాత్రం బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయంలో భర్త సపోర్ట్ చాలా ఉందంటున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా సత్యప్రేమ్‌కి కథ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కియారా. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన కియారా మీద ట్రోల్స్ కూడా గట్టిగానే వైరల్ అయ్యాయి. దీంతో సినిమా సక్సెస్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయారట ఈ బ్యూటీ.
పెళ్లి తరువాత మరో యంగ్ హీరోతో లిప్ లాక్ చేయటం గురించి కియారాను టార్గెట్ చేశారు నెటిజెన్స్. అయితే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో హెల్ప్ చేశారని చెప్పారు కియారా. ట్రోల్స్ విషయం సిద్ దృష్టికి వచ్చినా.. కనీసం ఒక్కసారి కూడా తనతో డిస్కస్ చేయలేదన్నారు కియారా. అంతేకాదు సోషల్ మీడియా నెగెటివిటినీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సిద్ధ్ తనకు నచ్చచెప్పారని గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ బ్యూటీ.
ప్రజెంట్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు కియారా. నెక్ట్స్ ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార్ 2లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించబోతున్నారు. పెళ్లి తరువాత కూడా ఇలా భారీ ప్రాజెక్ట్స్‌తో కెరీర్‌ను ఫుల్ ఫామ్‌లో కంటిన్యూ చేస్తున్నారు.




