AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సూపర్‌స్టార్ కృష్ణకే ఆ దమ్ము సొంతం.. ఎన్టీఆర్ ఫోన్ చేసి ఇలా అన్నారట

సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా నిర్మాణంలో ఎదురైన ఘటనలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు నిరాకరించడం, శోభన్ బాబు మొదట సుముఖత చూపకపోవడం, చివరకు కృష్ణ స్వయంగా సినిమా బాధ్యతలు స్వీకరించి పూర్తి చేయడం లాంటి కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

Tollywood: సూపర్‌స్టార్ కృష్ణకే ఆ దమ్ము సొంతం.. ఎన్టీఆర్ ఫోన్ చేసి ఇలా అన్నారట
Superstar Krishna
Ravi Kiran
|

Updated on: Feb 01, 2026 | 1:57 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు. గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు పంచుకున్నారు. ముఖ్యంగా దేవదాస్, కురుక్షేత్రం చిత్రాల వెనుక ఉన్న కీలక విషయాలను చెప్పారు. దేవదాస్ చిత్రం విడుదలైనప్పుడు దాని నిడివి(19000 అడుగులు, సుమారు 4 గంటలు) గురించి పలు చర్చలు జరిగాయి. పంపిణీదారులు సినిమా గొప్పగా ఉన్నప్పటికీ, నిడివి ఎక్కువ కావడం వల్ల కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి సీనియర్ టెక్నీషియన్లు ఆది సుబ్బారావు, ఎల్.వి.ప్రసాద్, పుల్లయ్య లాంటి వారిని పిలిచి సినిమాను ప్రొజెక్షన్ వేయించి, వారి సలహాలు కోరానని కృష్ణ చెప్పారు. పుల్లయ్య సినిమా చూసి, “ఎవడ్రా అసలు ఈ పిక్చర్ లో కట్ చేయమంది? ఈ లెంత్ అద్భుతంగా ఉంది. ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు” అని చెప్పి వెళ్లిపోయారు. సుబ్బారావు కూడా సినిమా చూసి, “సాధారణంగా సినిమాలు చూస్తుంటే నాకు టెక్నికల్ గా ఇన్వాల్వ్ మెంట్ ఎప్పుడూ వచ్చేది కాదయ్యా. ఈ సినిమాలో ఒకటి రెండు చోట్ల గబుక్కున కళ్ళంట నీళ్ళు తిరిగినాయి” అని ప్రశంసించారు. ఎల్.వి.ప్రసాద్ అయితే సినిమా చూసిన తర్వాత కృష్ణకు ఫోన్ చేసి, “చాలా అద్భుతం అమ్మా సినిమా. ఈ సినిమా చూసినాక నేను మీ ఫ్యాన్ అయిపోయాను” అని చెప్పినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రశంసలు ఆయనకు అవార్డుతో సమానం అని చెప్పారు. అయితే, విడుదల సమయంలో నిడివి లేదా పాటలు అనుకున్నంతగా హిట్ కాకపోవడం వల్ల సినిమా ఆశించిన విజయం సాధించలేదని, తర్వాత 13000 అడుగులకు నిడివిని తగ్గించి విడుదల చేయగా మంచి ఆదరణ లభించిందని కృష్ణ వివరించారు.

ఆ తర్వాత, కురుక్షేత్రం సినిమా నిర్మాణంలో జరిగిన అనూహ్య సంఘటనలను కృష్ణ పంచుకున్నారు. మొదట ఈ సినిమాను శోభన్ బాబుతో తీయాలని అనుకున్నారట. శోభన్ బాబు మొదట చేస్తాను అని చెప్పి, మల్లెపువ్వు సినిమా విజయం తర్వాత కథలో వంకలు పెట్టి నిరాకరించారు. దీంతో శోభన్ బాబు కంటే పెద్ద ఆర్టిస్ట్‌తో సినిమా తీయాలనే పంతంతో కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుని సంప్రదించారు. ANR కథ నచ్చితే చేస్తానని చెప్పగా, ఆరుద్ర, హిందీలో మహేబూబ్ కథ వినిపించారు. ANRకి కథ నచ్చి, వెంటనే కాల్ షీట్లు ఇచ్చారు.

అయితే, ఒరిజినల్ కురుక్షేత్రం ప్రొడ్యూసర్ ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులు(పాండవ వనవాసం, శ్రీజన్మ చిత్రాల నిర్మాత) కృష్ణను అర్జునుడి పాత్రకు అడిగారు. అప్పుడు కృష్ణ కృష్ణుడి పాత్ర ఎవరు వేస్తారని ప్రశ్నించగా, ఆంజనేయులు నాగేశ్వరరావుని అడుగుతానని చెప్పారు. ANR కృష్ణుడి పాత్ర తన పర్సనాలిటీకి సరిపోదని నిరాకరించారు. ఆ తర్వాత ఆంజనేయులు ఎన్.టి.రామారావుని సంప్రదించగా, ఆయన కూడా కృష్ణుడి పాత్రను తిరస్కరించారు. చివరకు శోభన్ బాబును అడగగా, ఆయన కూడా మొదట కురుక్షేత్రంకు బదులుగా వేరే సబ్జెక్ట్ చేయమని సూచించారు.

ఈ పరిస్థితుల్లో కృష్ణ, ఆంజనేయులుకి “శోభన్ బాబుకు నచ్చలేదంటే వదిలేయండి, మనమిద్దరం వేరే సినిమా చేసుకుందాం” అని సలహా ఇచ్చారు. కానీ శోభన్ బాబు, కురుక్షేత్రం అయితేనే చేస్తానని, వేరేది చేయనని పట్టుబట్టారు. అప్పుడు కృష్ణ “నన్ను వదిలేసి రామకృష్ణనో, హరనాథనో పెట్టుకుని చేసుకోండి” అని చెప్పారు. కానీ ఆంజనేయులు “మీ పేరు చెప్పే బిజినెస్ చేశాం, మాకు ఒప్పుకున్నావ్ డేట్లు ఇచ్చావు, ఈ సినిమానే తీస్తాను, నువ్వు యాక్ట్ చేయాల్సిందే” అని ఖరాకండిగా చెప్పారు. ఈ పరిణామాల మధ్య ఎన్.టి.రామారావు కృష్ణకు ఫోన్ చేసి, “వాడి(ఆంజనేయులు) పంతం వాడు వదలడు, నువ్వే లొంగు” అని సలహా ఇచ్చారు. అలా ఆ సినిమా మొదలై, కొంతకాలం తర్వాత ఎన్టీఆర్ చెప్పినట్లే, ఆంజనేయులు సినిమా బాధ్యతను కృష్ణ మీదే వదిలేశారు. పూర్తి ఇన్వాల్వ్‌మెంట్‌తో కృష్ణ ఆ చిత్రాన్ని పూర్తి చేశారు.

ఇది చదవండి: 

అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..