Mahabubnagar Gold Theft: మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీలో సుకన్య అనే వృద్ధురాలిని పోలీసులుగా నమ్మించి దొంగలు బంగారు పుస్తెల తాడును చోరీ చేశారు. ఇటీవల దొంగతనాలు జరుగుతున్నాయని బెదిరించి, పుస్తెల తాడును తీసి సంచిలో పెట్టుకోవాలని సూచించారు. మాటల్లో మాయచేసి నిజమైన నగలను కాగితం పొట్లంతో మార్చి మోసం చేశారు. ఈ తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.