AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

Phani CH
|

Updated on: Feb 01, 2026 | 12:41 PM

Share

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని విఠలేశ్వర స్వామి ఆలయం వెనుక అక్రమ గంజాయి సాగు బయటపడింది. ఎక్సైజ్ దాడుల్లో 600 మొక్కలు, 15 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం అధిపతి నాగన్నా మహరాజ్ అరెస్ట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రాంతంలో మాదకద్రవ్యాల సాగు స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

భక్తి వెల్లివిరియాల్సిన ఆధ్యాత్మిక క్షేత్రం పరిసరాల్లో అక్రమ గంజాయి సాగు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ విఠలేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో భారీ ఎత్తున గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో సుమారు 600 గంజాయి మొక్కలు, 15 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ సాగుకు సంబంధించి ఆలయానికి సమీప భూముల్లో గంజాయి పెంచుతున్న దేవస్థానం అధిపతి నాగన్నా మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలయానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో, ఇలాంటి అక్రమ కార్యకలాపాలు బయటపడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన ప్రాంతంలో మాదకద్రవ్యాల సాగు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పరారీలో ఉన్న ఇతర అనుమానితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఆలయాల సమీపంలోనే ఇలాంటి అక్రమ సాగు జరగడం అధికారులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి

తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే

హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం

Union Budget 2026: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ రూట్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు..