AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే

తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే

Phani CH
|

Updated on: Feb 01, 2026 | 12:00 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ సమీపంలో రాజ్‌గఢ్ ప్యాలెస్ తవ్వకాల మట్టిలో పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ వార్తతో గ్రామాలన్నీ నిధి వేటలో మునిగిపోయాయి. కర్ణాటకలో గతంలో ఇలాంటి సంఘటనే జరగగా, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బంగారు నాణేలు దొరుకుతుండటం జనంలో ఉత్సాహం నింపింది. అయితే వీటి విలువ, ప్రాచీనత నిపుణుల పరిశీలనలో ఉంది.

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. మొన్న కర్నాటకలో జరిగింది, లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లో రిపీటయింది. మధ్యప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో ఇప్పుడు బంగారు నాణేలు దొరుకుతున్నాయట. దీంతో జనం ఎగబడి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. చిన్నాపెద్దా ముసలిముతకా ఆడామగా… అందరికి అదే పని. ఊరు ఊరంతా బంగారు నాణేల వేటలో మునిగిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ దగ్గర రాజ్‌గఢ్‌ రాజకోట ఉంది. రాజ్‌గఢ్ ప్యాలెస్‌ను ఓబెరాయ్ గ్రూప్ తీసుకుని, దాన్ని లగ్జరీ హోటల్‌గా మారుస్తున్న సమయంలో భారీగా తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో వచ్చిన మట్టిని సమీపంలో ఉన్న గ్రామం దగ్గర రోడ్డుపై పోశారు. ఆ తర్వాత వర్షం పడింది. దీంతో ఆ మట్టిలో నుంచి బంగారు నాణేలు బయటపడ్డాయి. దీంతో అటుగా వెళ్లే వాళ్లలో కొందరికి 50 నుంచి 100 బంగారు నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఈ నాణేలు ప్రకాశవంతంగా, పాతవిగా కనిపిస్తున్నాయి. ప్రజలు వీటిని సుమారు 500 ఏళ్ల నాటి బంగారు నాణేలుగా భావిస్తున్నారు. కానీ, నిపుణులు ఇంకా తనిఖీ చేయలేదు. వీటి విలువ, ప్రాచీనత గురించి అధికారికంగా నిర్ధారించలేదు. అయితే ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్లంతా, బంగారు నాణేల కోసం వేట మొదలెట్టారు. ఈ క్రమంలో ఛత్తర్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ స్పందిస్తూ..తమ గ్రామంలో బంగారు నాణేలు దొరికిన మాట వాస్తవమేనని చెప్పారు. ఇటీవల కర్నాటకలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గదగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాదులు తీస్తుండగా గుప్తనిధి బయటపడింది. గంగవ్వ బసవరాజ్ ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు కిలో బరువు ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా అదే సీన్‌ రిపీటయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం

Union Budget 2026: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ రూట్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు..