Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే
విటమిన్ డి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి ముఖ్యం. లోపం సర్వసాధారణం. సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు, కొవ్వు ఉన్న ఆహారంతో (గుడ్లు, అవకాడో) ఉదయం పూట తీసుకోవాలి. రాత్రిపూట నిద్రలేమికి కారణం కావచ్చు. ఖాళీ కడుపుతో వద్దు. మోతాదు వయస్సు, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు వైద్యుల సలహా తప్పనిసరి.
విటమిన్ డి మన శరీరానికి అత్యంత అవసరం. ఇది ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి, అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుండటంతో చాలామంది క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్ల రూపంలో దీనిని తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డిని ఎప్పుడు, ఎలా తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మనం తీసుకునే సమయాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందంటున్నారు. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో, కొవ్వులు ఉన్న ఆహారంతో తీసుకుంటే శరీరం దీనిని మెరుగ్గా గ్రహిస్తుంది. గుడ్లు, ఆలివ్ ఆయిల్, అవకాడో, డ్రై ఫ్రూట్స్ వంటి మంచి కొవ్వులు ఉన్న ఆహారాలతో కలిపి విటమిన్ డి తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఖాళీ కడుపుతో తీసుకుంటే శోషణ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే విటమిన్ డి తీసుకునే సమయం కూడా ముఖ్యమే. రాత్రి సమయంలో తీసుకుంటే నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపి నిద్రలేమికి కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఉదయం పూట లేదా భోజన సమయంలో విటమిన్ డి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వయస్సు, బరువు, సూర్యరశ్మికి ఎంతవరకు గురవుతున్నాం, రక్తంలో విటమిన్ డి స్థాయిలు వంటి అంశాల ఆధారంగా మోతాదు మారుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే విటమిన్ డి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

