19 రోజుల తర్వాత స్వగ్రామం చేరిన వలస కార్మికుడి మృతదేహం
ఇరాక్‌లో మెదడు సంబంధిత అనారోగ్యంతో మృతి చెందిన శ్రీకాకుళం వలస కార్మికుడు పిలక బాలకృష్ణ మృతదేహం 19 రోజుల తర్వాత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో స్వగ్రామానికి చేరుకుంది. బాగ్దాద్‌లో పరిచయాలు లేక కుటుంబం మృతదేహాన్ని రప్పించడంలో తీవ్ర ఇబ్బందులు పడింది. మంత్రి విదేశాంగ శాఖ, ఇరాక్ ఎంబసీతో సమన్వయం చేసి మృతదేహం తిరిగి వచ్చేలా చూడటంతో కుటుంబం దుఃఖంతో స్వాగతించింది.
పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన వలస కార్మికుడి మృతదేహం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో 19వ రోజుకు స్వగ్రామానికి చేరింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన పిలక బాలకృష్ణ ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ప్రోక్లేయిన్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా అక్కడే జీవనం సాగిస్తూ, అవకాశం దొరికినప్పుడల్లా స్వగ్రామానికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉండేవారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి, జనవరి 2న తిరిగి బాగ్దాద్ వెళ్లిన బాలకృష్ణ, మెదడు సంబంధిత అనారోగ్యంతో జనవరి 13న అక్కడే మృతి చెందారు. బాగ్దాద్‌లో ఎవరూ పరిచయం లేకపోవడంతో మృతదేహం రప్పించడంలో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. విషయం ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి వెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. విదేశాంగ శాఖ, ఇరాక్ ఎంబసీతో సమన్వయం చేసి మృతదేహం భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మృతదేహం శుక్రవారం ఢిల్లీ చేరుకుని, శనివారం జాడుపూడి గ్రామానికి వచ్చింది. ఇన్నాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన కుటుంబం బాలకృష్ణ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం
నింగిలో మిగ్ గర్జనలు.. పర్యాటకుల హర్షధ్వానాలు!
రోడ్డుపై రన్‌వే..చైనాకు దగ్గర్లో మోదీ విమానం
డేగకన్ను పడిందంటే డ్రోన్ కూలాల్సిందే!
పేలిన విమానం ఇంజిన్.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్ !
45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఈజిప్టు పిరమిడ్లలో తమిళ వ్యాపారి పేరు!
కుక్కర్ల గొడవ Vs ఓటర్ల తీర్పు! ఆ అభ్యర్థినే గెలిపించిన జనం!

