AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్ అయ్యారు..’

సూపర్‌స్టార్ కృష్ణ సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారని సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తెలిపారు. పండంటి కాపురం చిత్రాన్ని కలర్‌లో నిర్మించి విజయం సాధించిన కృష్ణ.. దేవదాసు రీమేక్‌కు పూనుకున్నారు. ఈ చిత్రాన్ని సాంకేతికంగా డెవలప్ చేసి కలర్‌లో తీయాలని ఆశించారు. అయితే, విడుదల రోజున ఏఎన్ఆర్ తన పాత దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడంతో కృష్ణ చిత్రం తీవ్రంగా నష్టపోయింది.

Tollywood: 'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్ అయ్యారు..'
Anr & Krishna
Ravi Kiran
|

Updated on: Feb 01, 2026 | 1:38 PM

Share

సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ కృష్ణ సినీ కెరీర్‌లోని కొన్ని ముఖ్య విషయాలను ఆయన పంచుకున్నారు. కృష్ణ తన సినీ కెరీర్‌లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడేవారు కాదని ఆయన పేర్కొన్నారు. పండంటి కాపురం చిత్రం సమయంలో, డిస్ట్రిబ్యూటర్లు కలర్ చిత్రాలు అప్పట్లో పెద్దగా ఆడడం లేదని, బ్లాక్ అండ్ వైట్‌లో తీయమని సూచించినప్పటికీ, కృష్ణ తమ నిర్ణయానికి కట్టుబడి 12 లక్షల రూపాయల బడ్జెట్‌తో కలర్‌లో నిర్మించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్, గుమ్మడి, దేవిక, బి. సరోజ, ప్రభాకర్ రెడ్డి లాంటి స్టార్ నటులు నటించారు.

అలాగే, కృష్ణ దేవదాసు చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి సాంకేతికంగా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందిందని, కలర్‌లో తీస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి లభిస్తుందని ఆయన భావించారు. అయితే, ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం ఒక మైనస్ పాయింట్‌గా నిలిచింది. రిలీజ్ రోజున ఏఎన్ఆర్ తన పాత దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడం కృష్ణ రీమేక్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. పాత చిత్రం ఎదురు థియేటర్‌లో ప్రదర్శన చేయడంతో.. కృష్ణ దేవదాసు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ కృష్ణ తన ప్రయత్నంపై పశ్చాత్తాపపడలేదని వినాయకరావు వివరించారు.

ఇది చదవండి: 

అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us