AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని

నటి ఆమనిఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరోయిన్ సౌందర్య గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సౌందర్య ఎంత మంచి మనిషి, నిగర్వి, సాధారణ జీవితాన్ని కోరుకునే వ్యక్తి అని వివరించారు. అలాగే ఓ హీరో గురుంచి కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని
Aamani
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2026 | 10:32 AM

Share

ప్రముఖ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడి ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూనే సీరియల్స్ లోనూ నరుస్తూ మెప్పిస్తున్నారు . కాగా గతంలో ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమని మాట్లాడుతూ, సినీ రంగంలో తనకంటూ ఎక్కువ స్నేహితులు లేరని, తక్కువ మందితోనే ఎక్కువగా కలుస్తానని చెప్పారు. అయితే, సౌందర్యతో మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేదానిని అన్నారు. ఇద్దరూ బెంగళూరుకు చెందినవారు కావడంతో, కన్నడ భాషలో మాట్లాడుకుంటూ స్నేహం మరింత బలపడిందని తెలిపారు. సౌందర్యతో కలిసి మూడు నాలుగు చిత్రాల్లో నటించడం, షూటింగ్ స్పాట్‌లో పక్కపక్కన కూర్చొని కన్నడ పాటలు పాడుకుంటూ, కన్నడలో మాట్లాడుకుంటూ గడపడం వంటివి వారి బంధాన్ని మరింత ధృఢపరిచాయని ఆమని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సౌందర్య ఆమెను చిన్న పిల్లకున్న అమాయకత్వంతో పోల్చారు.

ఆమని వివాహం తర్వాత కూడా సౌందర్యతో ఆమె స్నేహం కొనసాగింది. సౌందర్య తల్లి ఆమనిని తరచుగా ఫోన్ చేసి పలకరించేవారని, సౌందర్య తన సొంత సినిమా షూటింగ్‌ల సమయంలో ఆమనిని వచ్చి కలవమని కోరేదని ఆమని వివరించారు. సౌందర్య తండ్రి మరణించినప్పుడు, రాత్రి పది గంటల సమయంలో ఆమనిని హైదరాబాద్‌లోని ప్రశాంత్ కుటీర్‌కు పిలిచి, ఆమె భుజాలపై తలపెట్టి చిన్న పిల్లలా ఏడ్చారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నలుగురు స్తంభాల్లో ఒకరని, ఇప్పుడు తాము ముగ్గురే మిగిలామని సౌందర్య బాధపడినట్లు ఆమని చెప్పారు. ప్రశాంత్ కుటీర్‌తో సౌందర్యకు విడదీయరాని అనుబంధం ఉందని, పెద్ద హీరోయిన్ అయినా సరే ఆమె ఎప్పుడూ ఆ హోటల్ రూమ్ మార్చలేదని, అక్కడే వెజిటేరియన్ ఫుడ్ తినేవారని ఆమని తెలిపారు.

జగపతి బాబుతో సౌందర్యకు సంబంధం ఉందనే అప్పట్లో ప్రచారంలో ఉన్న పుకార్లపై ఆమని స్పందించారు. ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. జగపతి బాబుకి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నారని, ఆయనకు అలాంటి ఆలోచనలు లేవని అన్నారు. ఆయనకు సౌందర్యపై ఒక నటిగా గౌరవం, అభిమానం మాత్రమే ఉన్నాయని, ఆయన బ్యానర్‌లో కొన్ని సినిమాలు కూడా చేశారని ఆమని తెలిపారు. సౌందర్యకు కూడా అలాంటి ఆలోచన ఏమాత్రం లేదని, ఆమె తన తండ్రి మాటను గౌరవించి, ఆయన నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. తన తండ్రి, అన్నయ్య అమర్ చెప్పిన ప్రతి మాటనూ సౌందర్య వినేదని, ఆమె చిన్నపిల్లలాగే ఉండేదని ఆమని వివరించారు. కాబట్టి, జగపతి బాబుతో ఆమె సంబంధం గురించి వచ్చిన పుకార్లు కేవలం పరిశ్రమలో సృష్టించిన వదంతులు మాత్రమేనని ఆమని తేల్చిచెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us