Maa Inti Bangaram: అందుకే నేను ఎప్పుడూ అబ్బాయి గెటప్‌లోనే ఉంటా.. అసలు విషయం చెప్పిన మా ఇంటి బంగారం డైరెక్టర్
ప్రస్తుతం తెలుగులో ఉన్న లేడీ డైరెక్టర్లలో నందిని రెడ్డి ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుందామె. లేటెస్ట్ గా 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లేడీ డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘అలా మొదలైంది’ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు నందిని రెడ్డి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్, కల్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారామె. ఇప్పుడు మళ్లీ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు నందిని రెడ్డి. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక శనివారం (జూన్ 20) కూడా ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన నందిని రెడ్డి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని విషయాలను షేర్ చేసుకున్నారు.
‘చిన్నప్పుడు నాది ఉంగరాల జుట్టు.. జడ వేస్తుంటే.. చాలా నొప్పిగా ఉండేది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా హెయిర్ కట్ చేసుకునేదాన్ని. అదే ఇప్పుడు కూడా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి షార్ట్స్ వేసుకోవడం అలవాటు అయ్యింది. నేను ఎక్కువగా కంఫర్ట్ కోరుకుంటాను. అందుకే ఇప్పటికీ ఇలాంటి బట్టలే వేసుకుంటున్నా. 20ల్లో ఉన్నప్పుడు చీరలు కట్టుకున్నాను. కానీ నాకు చీర కట్టుకొని నడవడం కంఫర్ట్ గా అనిపించలేదు. మీరు ఎంత ఖరీదైన బట్టలు ఇచ్చినా నేను కంఫర్ట్ గా ఉన్నవి మాత్రమే ధరిస్తాను’ అని తన డ్రెస్సింగ్ అండ్ హేర్ స్టైల్ గురించి చెప్పుకొచ్చారు నందిని రెడ్డి
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుతున్నప్పుడు నేను కూడా ప్రేమలో పడ్డాను. కానీ ఆ ఏజ్ లో పెళ్లిదాకా వెళ్లేదు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు నచ్చిన వ్యక్తి ఎవరూ దొరకలేదు. నా కెరీర్ ని అర్థం చేసుకునే వ్యక్తి తారసపడలేదు. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి కానీ.. నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒంటరి అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు’ అని పేర్కొన్నారు నందిని రెడ్డి.
మా ఇంటి బంగారం సెట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




