AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీ ఉన్నా.. ఇండియా ఫిఫా వరల్డ్ కప్ ఎందుకు ఆడట్లేదు..? ఈ డౌట్ ఎవరికొచ్చిందో తెలుసా?

ప్రస్తుతం FIFA వరల్డ్ కప్ 2026 ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో పాపులర్ యూట్యూబర్ స్పీడ్, "ఇండియా ఎందుకు ఆడట్లేదు? విరాట్ కోహ్లీ ఉన్నా" అని అమాయకంగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. జనాభా, వనరులున్నా చిన్న దేశాలు ఆడుతుండగా, భారత్ అర్హత సాధించకపోవడంపై ఈ ప్రశ్న ఆలోచింపజేస్తోంది.

Video: కోహ్లీ ఉన్నా.. ఇండియా ఫిఫా వరల్డ్ కప్ ఎందుకు ఆడట్లేదు..? ఈ డౌట్ ఎవరికొచ్చిందో తెలుసా?
Fifa Wolrd Cup 2026
SN Pasha
|

Updated on: Jun 21, 2026 | 10:33 AM

Share

ప్రస్తుతం దాదాపు 70 శాతం ప్రపంచం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఎందుకంటే.. ఫిఫా వరల్డ్ కప్ 2026 హోరాహోరీగా సాగుతోంది. ప్రపంచంలో ఎక్కువ మంది పిచ్చెక్కిపోయే క్రీడల్లో ఫుట్‌బాల్ నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటుంది. మన దేశంలో క్రికెట్ అంటే ఎలా పడిచస్తారో.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫుట్‌బాల్‌కు అంత క్రేజ్ ఉంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో ప్రపంచ కప్ గెలిచేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. వీటిని చూసేందుకు మైదానాలకు వేల సంఖ్యలో ప్రేక్షకులు పోటెత్తుతున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన స్పీడ్ అనే కుర్రాడు.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఒక వింత్ ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. ఈ వరల్డ్ కప్‌లో ఇండియా ఎందుకు ఆడట్లేదు, వాళ్లు ఎందుకు క్వాలిఫై కాలేదు? ఇండియాకు మంచి ఫుట్‌బాల్ టీమ్ ఉంది, విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కొంత కాలం క్రితం ఈ స్పీడ్ అనే కుర్రాడు మన దేశంలో పర్యటించాడు. చాలా చోట్లకు వెళ్లాడు, వీడియోలు తీసుకున్నాడు, అలాగే గల్లీ క్రికెట్ కూడా ఆడాడు. తనకు విరాట్ కోహ్లీ ఆట ఇష్టమంటూ క్రికెట్ మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూశాడు.

అయితే కోహ్లీ క్రికెటర్ అనే విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నాడో ఏమో, కోహ్లీ ఉన్నా.. ఇండియా ఎందుకు ఫిఫా వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాలేదని అమాయకంగా అడిగాడు. అయితే అతను అమాయకంగా అడిగినా, సరదాగా అడిగినా.. అతనికి వచ్చిన డౌట్ మాత్రం చాలా ఆలోచింపజేసేలా ఉంది. అదేంటంటే.. ఇండియా ఎందుకు ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు క్వాలిఫై కావడం లేదు? మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, జనాభా పరంగా, డబ్బు పరంగా మన కంటే చాలా చిన్న దేశాలు, మన దేశంలోని ఓ చిన్న రాష్ట్రం అంత కూడా ఉండని దేశాలు కూడా ఫిఫా వరల్డ్ కప్ ఆడుతున్నాయి. కానీ ఇండియా ఇంకా క్వాలిఫైయర్ స్టేజ్ దాటడం లేదు. ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వీడియో చూడండి

మరిన్ని క్రికెట్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us