AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతలా ఈ సినిమాలో ఏముంది మావ..! రూ.9 కోట్లు పెడితే రూ. 40కోట్లు వసూల్ చేసింది..

ఇటీవలే కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పటికీ అన్ని సినిమాలు థియేటర్ లో పెద్దగా విజయాలను అందుకోలేకపోతున్నాయి. అదే సమయంలో చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలై హిట్స్ అందుకుంటున్నాయి.

అంతలా ఈ సినిమాలో ఏముంది మావ..! రూ.9 కోట్లు పెడితే రూ. 40కోట్లు వసూల్ చేసింది..
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2026 | 9:57 AM

Share

కొన్ని సినిమాలు  చిన్న బడ్జెట్ తో తెరకెక్కి మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతూ ఉంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో కంటెంట్ ను నమ్ముకొని చాలా సినిమాలు ఓటీటీలో రిలీజే అయ్యి విడుదలైన అన్ని భాషల్లో మంచి హిట్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దాంతో చిన్న సినిమాలు కూడా విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ రీజనల్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా విడుదలై కోట్లు రాబట్టింది ఈ సినిమా.

ఇంతకూ ఆ సినిమా ఏంటి.? ఆ మూవీ కథ ఏంటి.? అన్నది ఒక్కసారి చూద్దాం.! ఒక ఊర్లో ఓ మహిళ ఉంటుంది. ఆమె జీవితం ఎప్పుడూ కష్టాలమయం. ప్రతిరోజూ ఆమె ఎన్నో కష్టాలను చూస్తుంటుంది. ఆ కష్టాల నుంచి బయటపడేయమని ప్రతి రోజూ దేవుడిని వేడుకుంటుంది.. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతుంది. ఒకరోజు కోపంతో ఓ నది పక్క ఉన్న ఓ చీమల పుట్టపైకి రాయి విసిరేస్తుంది. దాంతో ఓ స్వామి ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయనను తన ఉరికి తీసుకెళ్తుంది. ఆయన ఆమెకు తప్ప మరెవరికి కనిపించడు, దాంతో ఆమెను చూసిన జనాలు తనలో తాను మాట్లాడుకోవడం చూసి పిచ్చిపట్టిందనుకుంటారు.

ఆతర్వాత ఏం జరిగింది.? ఆస్వామిజీ ఆమె జీవితాన్ని ఎలా మార్చాడు. ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అన్నది సినిమాలో చూడాలి. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది, ఈ సినిమా పేరు దేవూల్‌ బంద్‌ 2. మరాఠీలో ఈ సినిమా తెరకెక్కింది. రూ. 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ చిత్రం మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. స్నేహల్ తార్డే, సీనియర్ నటుడు మోహన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. మరాఠీలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమా టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us