AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi : శత్రువుల గుండెల్లో దడే.. భారత నౌకాదళంలోకి 3 అత్యాధునిక యుద్ధనౌకలు.. ప్రధాని చేతుల మీదుగా కమిషనింగ్

భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మునుపెన్నడూ లేని విధంగా భారత నౌకాదళంలోకి ఒకేసారి మూడు స్వదేశీ అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి. దేశీయ రక్షణ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఐఎన్‌ఎస్ దూనగిరి (INS Dunagiri), ఐఎన్‌ఎస్ సంశోధక్ (INS Sanshodhak), ఐఎన్‌ఎస్ అగ్రయ్ (INS Agray) యుద్ధనౌకలను కోల్‌కతాలో ప్రధాని మోదీ చేతుల మీదుగా వైభవంగా కమిషనింగ్ చేశారు. ఒకేసారి మూడు నౌకలు చేరడంతో భారత నౌకాదళం మరింత బలిష్టంగా మారింది.

PM Modi : శత్రువుల గుండెల్లో దడే.. భారత నౌకాదళంలోకి 3 అత్యాధునిక యుద్ధనౌకలు.. ప్రధాని చేతుల మీదుగా కమిషనింగ్
Pm Modi Inducts Ins Sanshodhak
Anand T
|

Updated on: Jun 21, 2026 | 10:55 AM

Share

భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన మూడు అత్యాధునిక యుద్ధనౌకలు ఒకేసారి భారత నౌకాదళంలోకి అడుగుపెట్టాయి. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్రక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా INS దూనగిరి, INS సంశోధక్, INS అగ్రయ్ యుద్ధనౌకల కమిషనింగ్ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బెంగాల్ గడ్డపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశ ఆలోచనలకు కొత్త దిశానిర్దేశం చేసి, దేశ పునరుజ్జీవనానికి ఊతమిచ్చిన గొప్ప భూమి బెంగాల్ అని కొనియాడారు. శతాబ్దాలుగా సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంతో అనుసంధానించడంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందన్నారు. స్వయంసమృద్ధ, సురక్షితమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ఇదొక మైలురాయని ఆయన అన్నారు. జూన్ 21న ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం రోజే, దేశంలోనే అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్ ను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం ఒక అద్భుతమైన కాకతాళీయమని మోదీ చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో దేశ భద్రత, అభివృద్ధి , శ్రేయస్సు పూర్తిగా సముద్రంతోనే ముడిపడి ఉంటాయని.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం మొత్తం ఎక్కవగా సముద్ర మార్గానే జరుగుతుందన్నారు. డిజిటల్‌గా ప్రపంచాన్ని కలిపే డేటా నెట్‌వర్క్ అంతా సముద్రం అడుగు భాగం నుంచే వెళ్తోందన్నారు. రాబోయే రోజుల్లో కీలకమైన ఖనిజాలు, సరికొత్త ఇంధన వనరుల అన్వేషణకు సముద్రాలే కేంద్ర బిందువు కాబోతున్నాయన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us