పాతకాలం స్టైల్‌లో గోంగూర చికెన్ నిల్వ పచ్చడి.. ప్రతి ముద్దలో అద్భుత రుచి!
Prasanna Yadla
21 June 2026
Pic credit - Pinterest
నాన్ వెజ్ పచ్చళ్ళు ఎప్పుడైనా మంచి రుచిని ఇస్తాయి అందుకే వీటిని ఎక్కువగా తింటారు
నాన్ వెజ్ పచ్చళ్ళు..
అరకిలో చికెన్‌ను తీసుకుని బాగా కడిగి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిని బాగా ఉడికించి నీరు మొత్తం ఇంకిపోయే వరకు వీటిని బాగా వేయించి పక్కన పెట్టాలి.
చికెన్
ఆ తరవాత 3 కట్టల గోంగూర ఆకులను బాగా కడిగి నీరు లేకుండా దీనిని ఫ్యాన్ కింద ఆరబెట్టి, నూనె లేకుండా వీటిని వేయించి మెత్తగా రుబ్బుకోవాలి.
గోంగూర ఆకులను..
ఇంకా 10 ఎండుమిర్చి , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్, ఇంకా కొద్దిగా మెంతులు కూడా బాగా పొడిగా చేసుకోవాలి.
పొడిగా చేసుకోవాలి
పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక , దీనిలో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు దీనిని బాగా వేయించాలి.
చికెన్ ముక్కలను వేయించాలి
ఇంకా అదే నూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించి వాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి
వెల్లుల్లి రెబ్బలు
ఇంకా రుబ్బిన గోంగూర పేస్ట్ ను వేసి నూనె పైకి తేలే వరకు ఉంచి, ముందుగా చేసుకున్న మసాలా పొడి, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
రుబ్బిన గోంగూర పేస్ట్
చికెన్ ముక్కలను గోంగూరలో వేసి 5 నిమిషాలు ఉంచి ఉడికించి చివరగా ఆయిల్ వేసి చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేస్తే 15 రోజులు ఉంటుంది.