AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్.. అఖిల్ కామెంట్స్ వైరల్

గతేడాది పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిలయ్యాడు అఖిల్ అక్కినేని. ఇదే క్రమంలో ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడీ అక్కినేని అందగాడు. అతను నటించిన లెనిన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhil Akkineni: టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్.. అఖిల్ కామెంట్స్ వైరల్
Akhil Akkineni
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 11:09 AM

Share

అక్కినేని అందగాడు అఖిల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతోంది. చివరిగా అతను 2023లో ఏజెంట్ సినిమాలో నటించాడు. ఇక గతేడాదే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిలయ్యాడు. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడీ అక్కినేని హీరో. అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు లెనిన్ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. హీరో అఖిల్ కూడా చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో అఖిల్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా పాల్గొంది. ఇంటర్వ్యూలో భాగంగా సుమ ‘తెలుగు సినిమా పరిశ్రమలో బెస్ట్ డాన్సర్ ఎవరు?’ అని అఖిల్ ను అడిగింది. దీనికి అఖిల్ ఏమాత్రం ఆలోచించకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు.

ఆ తర్వాత ‘రామ్ చరణ్ అంటే మీకు చాలా ఇష్టమా? అని సుమ ప్రశ్నించగా, అఖిల్ స్పందిస్తూ ‘ఇష్టం కాదు… లవ్’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అఖిల్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్‌ అంటే అఖిల్‌కు ఉన్న అభిమానం ఎంత ప్రత్యేకమైందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్, అఖిల్ అక్కినేని మంచి స్నేహితులు. వీరిద్దరు సొంత అన్నదమ్ముల్లా మెలుగుతుంటారు. ఒకరి పంక్షన్లకు మరొకరు తప్పకుండా హాజరవుతుంటారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు అఖిల్.

ఇక ‘లెనిన్’ సినిమా విషయానికి వస్తే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. బ్రహ్మాజీ, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు.

లెనిన్ సినిమాలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us