AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: బడ్జెట్‌లో బిగ్ రిలీఫ్.. ఈ వస్తువులపై భారీగా సుంకాలు తగ్గింపు..

కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాదాపు 80 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో బడ్జెట్‌లో పలు వస్తువులపై సుంకాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దిగుమతులపై సుంకాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Union Budget 2026: బడ్జెట్‌లో బిగ్ రిలీఫ్.. ఈ వస్తువులపై భారీగా సుంకాలు తగ్గింపు..
Fm Nirmala Sitharaman Budget Speech
Venkatrao Lella
|

Updated on: Feb 01, 2026 | 1:50 PM

Share

బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై సుంకాలను తగ్గించింది. విదేశాల నుంచి వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం 20 శాతంగా ఉండగా.. దీనిని 10 శాతానికి తగ్గించింది. సుంకం విధించదగిన అన్ని వస్తువులపై సుంకం రేటును తగ్గించింది.

వీటిపై సుంకం తగ్గింపు

సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటీమోనేట్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు బడ్జె్ట్ ప్రసంగంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి ఉపయోగించే విడి భాగాలపై సుంకాన్ని మినహాయించారు. బ్యాటరీ శక్తి నిల్వ కోసం ఉపయోగించే లిథియం అయాన్ తయారీ వస్తువులకు కూడా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎగుమతి కోసం సముద్ర ఆహారాలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే నిర్ధిష్ట ఇన్‌ఫుట్‌ల సుంకం రహిత దిగుమతులు పరిమిని పెంచాలని నిర్ణయించారు. ఎగుమతి టర్నోవల్ విలువలో ప్రస్తుతం 1 శాతం ఉండగా.. దీనిని 3 శాతానికి పెంచారు. ఇక తోలు, సింథటిక్ పాదరక్షల ఎగుమతులకు కూడా దీనిని విస్తరించనున్నారు.

టీడీఎస్ తొలగింపు

ఇక విమానాల తయారీకి ఉపయోగించే విడి భాగాలపై సుంకాన్ని మినహాయించాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. అలాగే విదేశీ విద్య, ఆరోగ్య ఖర్చులపై 5 శాతం నుంచి 2 శాతానికి టీసీఎస్‌ను తగ్గించారు. ఇక రూ.20 లక్షల కంటే తక్కువ విలువ గత ఆదాయంపై విదేశీ ఆస్తులను వెల్లడించకపోతే ఎటువంటి జరిమానా ఉండదు. కేవలం చిన్న నేరాలకు మాత్రం జరిమానా విధిస్తారు. ఇక మార్చి 31 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆటోమేటెడ్ ప్రక్రియను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక మోటార్ యాక్సిడెంట్ క్లెయిమస్‌పై టీడీఎస్‌ను తొలగించారు.  అటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రమాద చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక వికలాంగులకు అవసరమైన పరికరాలు త్వరగా, నాణ్యంగా అందేలా ‘దివ్యాంగ్ సహారా యోజన’ పథకం ప్రవేశపెట్టారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి 1.5 లక్షల మందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది.  అటు చిన్న వ్యాపారుల కోసం రూ. 10,000 కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల బిజినెస్ పెంచుకోవచ్చు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) లోన్లు సులభంగా దొరికేలా కొత్త పద్ధతిని బడ్జెట్‌లో తెస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Follow Us
QR కోడ్ నిజమైనదా.. నకిలీదా? పేమెంట్‌ చేసే ముందు ఇలా చెక్‌ చేయండి!
QR కోడ్ నిజమైనదా.. నకిలీదా? పేమెంట్‌ చేసే ముందు ఇలా చెక్‌ చేయండి!
మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. రుచిగా… హెల్తీగా
మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. రుచిగా… హెల్తీగా
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!
అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు.. మేనేజర్ ఏమన్నారంటే?
అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు.. మేనేజర్ ఏమన్నారంటే?
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు,సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు,సిరీస్‌లివే
గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే..
గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే..
ఇరాన్ అతి ముఖ్యమైన సైనిక స్థావరం ధ్వంసంః ట్రంప్
ఇరాన్ అతి ముఖ్యమైన సైనిక స్థావరం ధ్వంసంః ట్రంప్
శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి?
శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి?
ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధం వద్దని నిరసనలు!
ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధం వద్దని నిరసనలు!
సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? ఈ నంబర్లకు కాల్ చేస్తే..
సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? ఈ నంబర్లకు కాల్ చేస్తే..