Sudheerbabu: సుధీర్ బాబు కొత్త సినిమా షూటింగ్ షురూ… రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడంటే..?
హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశాన్ని డిసెంబర్ 4న హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతీశెట్టి మీద...

హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశాన్ని డిసెంబర్ 4న హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతీశెట్టి మీద చిత్రీకరించారు. వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. కెమెరాను రవి శంకర్ స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. కాగా ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ పై మహేంద్ర బాబు, కిరణ్ నిర్మిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నారు. సినిమా రెగ్యులర్ షూట్‌ను త్వరలో మొదలుపెట్టనున్నారు.
కాగా సుధీర్ బాబు 14వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి గతంలో రెండు సినిమాలు చేశారు. వీ మూవీకి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా.. అందులో నానితో కలిసి సుధీర్ బాబు నటించారు. ఈ సినిమా గతేడాది ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కాగా మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సోలో హీరో సమ్మోహనం సినిమాను చేశాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
మూవీ ఓపెనింగ్ ట్వీట్…
.@benchmarkstudi5 production1️⃣ #Sudheer14 with #MohankrishnaIndraganti Muhurtham✨
?by #VVVinayak ?switch on #Ravishankar(Mythri) ?script @VenkyKudumula 1st shot Dir #DilRaju @isudheerbabu @IamKrithiShetty #VivekSagar @mahendra7997 @Kiranballapalli @SudheerCotton @pgvinda pic.twitter.com/2Qx6NOGwKX
— BARaju (@baraju_SuperHit) January 4, 2021
Also Read :
Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ
Niharika Insta Post: ‘పైన ఆకాశం.. కింద ఇసుక.. మధ్యలో’.. హనీమూన్ ఫొటోలను షేర్ చేసిన మెగా డాటర్..