100% occupancy in theatres: థియేటర్ యజమానులకు శుభవార్త.. ఇకపై వంద శాతం ఆక్యుపెన్సీ.. కానీ..
Govt permits 100% occupancy in theatres: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్ కారణంగా...

Govt permits 100% occupancy in theatres: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్ కారణంగా సినిమా చిత్రీకరణలు ఆగిపోవడం, థియేటర్లు మూతపడడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక కేంద్రం ఇచ్చిన సడలింపుల మేర ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో థియేటర్లు కూడా తెరుచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ కేవలం 50 శాతం ఆక్యూపెన్సీతోనే నడిపించాలనే షరతు పెట్టిన విషయం తెలిసిందే . అయితే ఇప్పటికే ఆరు నెలలకుపైగా థియేటర్లు మూతపడడంతో నష్టపోయిన థియేటర్ల యజమానులు ఈ నిబంధనతో మరింత నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం థియేటర్లకు అనుమతిచ్చినప్పటికీ కొంత మంది యజమానులు థియేటర్లను తిరిగి ప్రారంభించలేదు. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై తమిళనాడులో థియేటర్లను 100 శాతం ఆక్యూపెన్సీతో నడుపుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి జీవోను కూడా జారీ చేసింది. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని ఎప్పుడు కల్పిస్తాయో చూడాలి.
Also Read: Urmila vs Kangana Ranaut: మళ్ళీ మొదలైన కంగనా, ఊర్మిళ మధ్య వార్… బాలీవుడ్‌లో హాట్ టాపిక్