AP Police Duty Meet Live Updates: ప్రారంభమైన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్.. మాట్లాడుతున్న సీఎం జగన్..
Ap Police Duty Meet: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత పోలీస్ డ్యూటీ మీటింగ్ జరపడం ఇదే తొలిసారి.

Ap Police Duty Meet: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత పోలీస్ డ్యూటీ మీటింగ్ జరపడం ఇదే తొలిసారి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దేవుడు విగ్రహాలను కూల్చడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ప్రజా విశ్వాసాలను దెబ్బతిసి తప్పుడు ప్రచారాలు ఎవరికి లాభం, ఇవ్వన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరినీ లక్ష్యంగా చేసుకోని ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు.
LIVE NEWS & UPDATES
-
గత ప్రభుత్వానికి.. ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో చూడండి..
గత ప్రభుత్వం ఆరేళ్లుగా పోలీస్ డ్యూటీ నిర్వహించలేదు. దీన్ని బట్టే టీడీపీ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ‘మా వాళ్లు ఏం చేసినా చూసి చూడనట్లు వెళ్లాలని’ పోలీసులపై ఒత్తిడి ఉండేది. జంకూ బొంకు లేకుండా మాట్లాడే వారు. కానీ మేము మాత్రం తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టవద్దని చెప్పాం. అని సీఎం స్పష్టం చేశారు.
-
దేవాలయాల రక్షణకు ఎన్నో చర్యలు చేపట్టాం.. చేపడుతున్నాం..
రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పటికే 20 వేలకుపైగా గుడులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పన్నాగం ప్రకారమే గుడులపై దాడులు చేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసినవారే రచ్చ చేస్తున్నారు అని జగన్ చెప్పుకొచ్చారు.
-
-
ఇక నుంచి ప్రతి ఏటా పోలీస్ డ్యూటీ మీట్..
ఇక నుంచి ప్రతి ఏటా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తాం. పోలీసులు పనితీరు మార్చుకునేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుంది. సైబర్ క్రైమ్, మహిళల రక్షణపై చర్చ జరుగుతోంది. నేర పరిశోధనల్లో భాగంగా టెక్నాలజీని మెరుగుపర్చేందుకుగాను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాము అని జగన్ చెప్పుకొచ్చారు.
-
ప్రజల భద్రత కోసం ఐఐటీతో ఎంవోయూ..
పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీపై ఐఐటీతో ఎంవోయూ కుదుర్చున్నట్లు జగన్ తెలిపారు. సైబర్ సేఫ్టీ, ఉమెన్ సెఫ్టీ, కొత్త టెక్నాలజీపై సింపోజియంలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
-
తప్పు ఎవరు చేసినా వదిలేది లేదు..
తప్పు ఎవరు చేసినా తప్పే.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలేది లేదు. కొందరికి దేవుడంటే భయం, భక్తి లేదు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు.
-
-
చాలా గుడులు టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి..
రాష్ట్రంలో చాలా గుడులు దేవాదాయ శాఖ పరిధిలో లేవు. ఎక్కువ శాతం టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. కొందరు కావాలనే ప్రభుత్వానికి, పోలీసులకు చెడ్డ పేరు తెస్తున్నారు. పొలిటికల్ గొరిల్లా వార్ నడుపుతున్నారు.
-
అవినీతికి తావు లేకుండా పథకాలను అందిస్తున్నాం..
‘మా ప్రభుత్వంలో అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. దాన్ని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. మంచి చేసే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే. ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు’ అని విపకక్షాలను దుయ్యబట్టారు.
-
ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే ముందు రోజే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలు వీటన్నింటినీ ఆలోచించాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచాారాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
-
రాజకీయాల కోసం దేవుడుని సైతం వదలట్లేదు..
మంచి చేసే ప్రభుత్వాన్ని ఎదుర్కొలేకే కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారు. కలియుగంలో నేరాలు క్లైమాక్స్ కు వస్తున్నట్లున్నాయి. దేవుడు అంటే ఎవరికీ భయం లేదు. రాజకీయాల కోసం దేవుడుని సైతం వదట్లేదు. అని సీ ఎం జగన్ ప్రతిపకాలపై మండిపడ్డారు.
Published On - Jan 04,2021 1:57 PM