AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్, అనుమతించిన డీసీజీఐ, ఆందోళన అనవసరమన్న సంస్ధ

దేశంలో 12  ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇవ్వవచ్ఛు.. ఈ మేరకు ప్రభుత్వం అనుమతించింది.

12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్, అనుమతించిన డీసీజీఐ, ఆందోళన అనవసరమన్న సంస్ధ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 04, 2021 | 2:37 PM

Share

దేశంలో 12  ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇవ్వవచ్ఛు.. ఈ మేరకు ప్రభుత్వం అనుమతించింది. నిజానికి 12 ఏళ్ళు పైబడినవారికి ఈ టీకామందును ఇదివరకే ఇస్తున్నప్పటికీ, తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమ క్లినికల్ ట్రయల్స్ నిర్విరామంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు వలంటీర్ల  రుగ్మత లేదా అస్వస్థతకు సంబంధించి ఎలాంటి కేసూ నమోదు కాలేదని భారత్ బయోటెక్ వెల్లడించింది.  మూడో విడతలో   25 వేలమందికి పైగా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది. కాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు వెలిబుచ్చిన అభ్యంతరాలపై కేంద్ర మంత్రి  హర్షవర్ధన్ తీవ్రంగా  స్పందిస్తూ ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కి డీసీజీఐ అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.

అటు-కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని హడావుడిగా అనుమతించారని, థర్డ్ ట్రయల్స్ జరుగుతుండగానే ఇంత త్వరగా అనుమతించడం ఫ్రంట్ లైన్ వర్కర్ల ఆరోగ్యానికి దాదాపు ముప్పు తేవడం వంటిదేనని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ వంటి వారు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. Also Read :వ్యాక్సిన్ పంపిణీపై రష్యా సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 60ఏళ్లు పైబడిన వారికీ స్పుత్నిక్‌ టీకా Also  Read :‘కొవాగ్జిన్‌’ కరోనా టీకాపై ప్రధాని సమీక్ష.. భారత్‌ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో