Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urmila vs Kangana Ranaut: మళ్ళీ మొదలైన కంగనా, ఊర్మిళ మధ్య వార్… బాలీవుడ్‌లో హాట్ టాపిక్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రౌనత్,  రంగీలా భామ ఊర్మిళ మధ్య మళ్ళీ సోషల్ మీడియా వేదికగా మాటల వార్ మొదలైంది. సుశాంత్ ఆత్మాహత్య తర్వాత బాలీవుడ్ లో

Urmila vs Kangana Ranaut: మళ్ళీ మొదలైన కంగనా, ఊర్మిళ మధ్య వార్... బాలీవుడ్‌లో హాట్ టాపిక్
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 04, 2021 | 1:30 PM

Urmila vs Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రనౌత్,  రంగీలా భామ ఊర్మిళ మధ్య మళ్ళీ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం మొదలైంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో బంధు ప్రీతి ఉంది అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఊర్మిళ మండి పడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మొదలైన వివాదం తాజాగా ఊర్మిళ ముంబైలో ఇల్లు కొనుగోలు చేయడం.. దానిపై కంగనా వ్యాఖ్యానించడం మాటల యుద్దానికి తెరతీసింది. ఇటీవల ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వెంటన్ శివసేనలో చేరింది. కొన్ని రోజులకే రూ. 3 కోట్లు విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేసిందనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా కంగనా స్పందిస్తూ… ‘‘ఊర్మిళ జీ.. తాను తెలివి తక్కువ దానిననని.. అందుకనే బీజేపీని సపోర్ట్ చేసి.. అనేక కేసులను ఎదుర్కొంటున్నానని ట్వీట్ చేసింది. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇల్లును శివసేన ప్రభుత్వం కూల్చివేసింది. మీరు తెలివైన వారు.. కాంగ్రెస్, శివసేనలను సంతోష పరుస్తున్నారు.. దీంతో మీరు, మీ ఇల్లు సేఫ్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది బాలీవుడ్ క్వీన్.

అయితే కంగనా వ్యాఖ్యపై ఊర్మిళ వెంటనే స్పందించారు.. తాను ఎవరి దయాదాక్షిణాలతోనూ ఇల్లు కొనుగోలు చేయలేదని.. తాను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే ప్లాట్ కొనుక్కున్నాని తెలిపింది.  తాను రాజకీయాల్లోకి రాకముందే ఇల్లు కొన్నానని.. అందుకు సంబంధించిన డాక్టమెంట్స్ కూడా ఉన్నాయని తెలిపింది. ఆ పత్రాలను కంగనా ఎక్కడ ఎవరికీ చూపించమన్నా చూపించడానికి తాను రెడీ అంటూ సవాల్ విసిరింది ఊర్మిళ.  మరి ఊర్మిళ విసిరిన సవాల్ ను కంగనా స్వీకరిస్తుందో.. లేదో చూడాలి మరి..

Also Read: కాంగ్రెస్ వీడి శివసేన గూటికి చేరుతున్న బాలీవుడ్‌ నటి… సీఎం ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో చేరనున్న ఊర్మిళ మటోండ్కర్‌..!