మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘‘ఇందువదన కుందరదన’’ దంపతులు… సోషల్ మీడియా వేదికగా హర్షం
మెగాస్టార్ చిరంజీవిని హీరో సుధాకర్ కొమకుల, హారిక దంపతులు డిసెంబర్ 4న ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరుతో దిగిన ఫోటోలను...

MEGA Moment: మెగాస్టార్ చిరంజీవిని హీరో సుధాకర్ కొమకుల, హారిక దంపతులు డిసెంబర్ 4న ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరుతో దిగిన ఫోటోలను సుధాకర్ సోషల్ మీడియా వేదిక పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెగా మూమెంట్ అంటూ రాసుకొచ్చాడు. జీవితంలో మర్చిపోని అనుభూతని పేర్కొన్నాడు. తన సినిమా జర్నీని మెగాస్టార్ విన్నారని, సలహాలు ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఆయన హృదయం చాలా గొప్పదని, నటుడిగా మెరుగయ్యేందుకు సలహాలిచ్చారని పేర్కొన్నాడు.
కాగా, గతేడాది చిరంజీవి జన్మదిన సందర్భంగా చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన ఇందువదన కుందరదన పాటకు సుధాకర్, ఆయన భార్య హారిక వారిలానే నృత్యం చేశారు. ఆ వీడియో చిరు దృష్టిని సైతం ఆకర్షించింది. తర్వాతి రోజుల్లో ఫేస్‌బుక్ వేదికగా చిరంజీవి సుధాకర్ దంపతులను అభినందించాడు.
సుధాకర్ చేసిన ట్వీట్ ఇదే…
MEGA Moment for a Lifetime. The most precious meeting for us @KChiruTweets annayya’s residence ??. Listening to my journey and extending his support and encouragement is out of World experience #MegaStarChiranjeevi garu – Golden Heart ❤️ ❤️❤️ @UrsSudhakarK @HarikaSandepogu Luv U pic.twitter.com/LkDfCSqOa1
— Sudhakar Komakula (@UrsSudhakarK) January 4, 2021
Also Read:
Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ
Niharika Insta Post: ‘పైన ఆకాశం.. కింద ఇసుక.. మధ్యలో’.. హనీమూన్ ఫొటోలను షేర్ చేసిన మెగా డాటర్..