Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth : తలైవాకు తలనొప్పిగా మారిన అభిమానులు.. ప్రశాంతత కోసం అమెరికాకు పయనమవుతున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాట సంచలనంగా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషంలో తేలిపోయారు...

Rajinikanth : తలైవాకు తలనొప్పిగా మారిన అభిమానులు.. ప్రశాంతత కోసం అమెరికాకు పయనమవుతున్న సూపర్ స్టార్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 04, 2021 | 1:24 PM

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాట సంచలనంగా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషంలో తేలిపోయారు. సినిమా రంగంలో అండగా ఉంటూ వస్తున్న అభిమానులు రాజకీయంగానూ సూపర్ స్టార్ ను సపోర్ట్  చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా రజినీకాంత్ రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంలేదని ప్రకటించారు. అయితే రజినీ  నిర్ణయాన్ని కొంతమంది  అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఆయన ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. దాంతో కొంతమంది అభిమానులు తలైవకు తలనొప్పిగా మారారు. దాంతో ఆయనలో మానసిక ఒత్తిడి ఎక్కువైందని తెలుస్తుంది. ఇందుకోసం కొద్దిరోజులు ఎటైనా దూరంగా వెళ్లాలనుకుంటున్నారట సూపర్ స్టార్.

గతంలోనూ రజినీకాంత్ విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్లేవారు. కానీ ఈసారి ఏకంగా సప్తసముద్రాల దాటి వెళ్లాలని భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగుంటే సూపర్ స్టార్ ఈపాటికి పార్టీని ఏర్పాటు చేసి ఉండేవారు. కానీ ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లో నలుగురికి కరోనా రావడం, అదే సమయంలో ఆయన అధిక రక్తపోటుతో  అనారోగ్యానికి గురవ్వడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు కొద్దిరోజుల ప్రశాంతత కోసం సూపర్ స్టార్ అమెరికా వెళ్లనున్నారని తెలుస్తుంది. రెండు నెలల పాటు ఆయన అక్కడే ఉండనున్నారని, అందుకోసం కుటుంబసభ్యులు ఏర్పాట్లు కూడా చేసారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రజినీకాంత్ ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజల విరామం తర్వాత ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ లో రజినీకాంత్ పాల్గొంటారని కొంతమంది అంటున్నారు.

ALSO READ : urmila vs kangana ranaut: మళ్ళీ మొదలైన కంగనా, ఊర్మిళల మధ్య వార్… బాలీవుడ్ లో హాట్ టాపిక్