RX100 Hindi remake: ‘ఆర్‌ఎక్స్ 100’ హిందీ రీమేక్.. ఒరిజినల్‌కు మించి రొమాన్స్ సీన్స్ ఉంటాయని మేకర్స్ హింట్
బోల్డ్ కాన్సెప్ట్‌తో సూపర్ హిట్ అయిన టాలీవుడ్ మూవీ 'ఆర్‌ఎక్స్ 100'. హాట్ హాట్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ మేకర్స్ ను కూడా అట్రాక్ట్ చేసింది. అందుకే సీనియర్ హీరో

RX100 Hindi remake: బోల్డ్ కాన్సెప్ట్‌తో సూపర్ హిట్ అయిన టాలీవుడ్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’. హాట్ హాట్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ మేకర్స్ ను కూడా అట్రాక్ట్ చేసింది. అందుకే సీనియర్ హీరో సునీల్ శెట్టి తన కొడుకు అహాన్ లాంచింగ్‌కు ఈ మూవీనే సెలెక్ట్ చేసుకున్నారు. అయితే బాలీవుడ్ ‘ఆర్‌ఎక్స్ 100’ ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఒరిజినల్ వర్షన్ ను మించే స్థాయిలో బోల్డ్ సీన్స్ ఉంటాయట. తెలుగు వర్షన్‌లో వచ్చిన సీన్సే అప్పట్లో రచ్చ రచ్చ అయ్యాయి. ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ పాయల్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో అంతకు మించి అంటే… ఇంకేం చూపిస్తారో! అని షాక్ అవుతున్నారు ఆడియన్స్.
తెలుగులో పాయల్ చేసిన రోల్ బాలీవుడ్లో తారా సుతారియా చేస్తున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్‌లతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ‘ఆర్‌ఎక్స్ 100’ రీమేక్ తో అమ్మడి ఇమేజ్ ఇంకే రేంజ్‌కు వెళుతుందో చూడాలిమరి.
Also Read :