AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 Movies: ఒకే ఏడాది 7 రిలీజ్‌లతో స్టార్ హీరోయిన్ రికార్డ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ తరం హీరోయిన్లకు అవకాశాలు రావడమే కష్టంగా ఉన్నసమయంలో ఒకే ఏడాదిలో ఏడు సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ స్టార్ హీరోయిన్! కెరీర్ మొదట్లో అంతగా అవకాశాల్లేక వెనకబడిన ఆ నటి ప్రస్తుతం వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉండటం ఇండస్ట్రీలోనే సంచలనం ..

7 Movies: ఒకే ఏడాది 7 రిలీజ్‌లతో స్టార్ హీరోయిన్ రికార్డ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
Star Heroine
Nikhil
|

Updated on: Nov 21, 2025 | 10:30 AM

Share

ఈ తరం హీరోయిన్లకు అవకాశాలు రావడమే కష్టంగా ఉన్నసమయంలో ఒకే ఏడాదిలో ఏడు సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ స్టార్ హీరోయిన్! కెరీర్ మొదట్లో అంతగా అవకాశాల్లేక వెనకబడిన ఆ నటి ప్రస్తుతం వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉండటం ఇండస్ట్రీలోనే సంచలనం.

అంతేకాదు, ప్రతి సినిమా ఒక్కొక్కటి బిగ్ బ్యానర్, స్టార్ హీరోలతో, టాప్ డైరెక్టర్లతో రూపొందుతోంది. ఈ హీరోయిన్ కేవలం అందం, నటనతో మాత్రమే కాకుండా, విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులు ఆకర్షిస్తోంది. ఒక్క ఏడాదిలో ఏడు ప్రాజెక్టులు అంటే, షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషన్స్ మధ్య బ్యాలెన్స్ చేయడం అంటే ఎంత కష్టమో ఊహించండి. ఈ బిజీనెస్ వెనుక ఆమెకు వచ్చిన అవకాశాలు, ఆమె నటన ప్రతిభ మాత్రమే కారణం. ఈ హీరోయిన్ ఇప్పుడు మల్టీ-స్టారర్స్, విలన్ రోల్స్, ఎమోషనల్ డ్రామాల్లోనూ కనిపిస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేశారా?

ఒక ఏడాది.. ఏడు సినిమాలు..

దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికలు ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేయడమే కష్టమైన ఈ ట్రెండ్‌లో, అనుపమ పరమేశ్వరన్ అసాధారణ ఫీట్ సాధించింది. 2025లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఏడు చిత్రాల రిలీజ్‌లతో అనుపమ రికార్డ్‌ సృష్టించింది. గతకొన్నేళ్లలో ఇలాంటి రికార్డ్ ఎవరూ సాధించలేదని ఇండస్ట్రీ టాక్. మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ. 2015లో ‘ప్రేమం’తో డెబ్యూ చేసిన అనుపమ వరుస అవకాశాలతో దక్షిణాదిన తిరుగులేని హీరోయిన్గా రాణిస్తోంది.

Anupama Parameswaran

Anupama Parameswaran

ఈ ఏడాది అనుపమకు మల్టీపుల్ రిలీజ్‌లు వచ్చాయి. తమిళంలో ‘డ్రాగన్’, ‘బైసన్’ మంచి విజయాలు సాధించాయి. ‘ది పెట్ డిటెక్టివ్’ ఫ్యాన్స్‌ను నవ్వించింది. తెలుగులో ‘కిష్కింధపురి’, ‘పరదా’ ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. మలయాళంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు, ఆమె ఏడో సినిమా ‘లాక్‌డౌన్’ డిసెంబర్ 5న విడుదలవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం, కోవిడ్-19 లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘భోగి’ సినిమాలోలో శర్వానంద్ పక్కన నటిస్తున్న అనుపమ ఈ రికార్డ్‌తో మల్టీ-ఇండస్ట్రీ స్టార్‌గా మారింది.