పక్కా పల్లెటూరి కుర్రోడిగా కనిపించనున్న శ్రీవిష్ణు.. మరో సినిమాను లైన్లో పెట్టనున్న టాలెంటెడ్ హీరో..

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గాలి సంపత్'. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా

  • Rajitha Chanti
  • Publish Date - 1:31 pm, Tue, 26 January 21
పక్కా పల్లెటూరి కుర్రోడిగా కనిపించనున్న శ్రీవిష్ణు.. మరో సినిమాను లైన్లో పెట్టనున్న టాలెంటెడ్ హీరో..

Hero Srivishnu: యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న రాజా రాజా చోరా మూవీ ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. అటు మరో సినిమాకు కూడా ఈ యంగ్ టాలెంటెడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

తాజా సమాచారం ప్రకారం శ్రీవిష్ణు బసంతి ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీవిష్ణు పక్కా పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రస్తుతం శ్రీవిష్ణు గాలి సంపత్ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి సమర్పణలో రొమాంటిక్ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్. కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:

Pawan Kalyan : షూటింగ్ మొదలు పెట్టిన పవన్.. బుల్లెట్ పైన పవర్ స్టార్.. ఆకట్టుకుంటున్న వీడియో