టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్

టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 1:01 PM

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు విడుదలకాగా.. తాజాగా జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లుగా టాలీవుడ్‏లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి యాత్రం ఫేం మహేష్ వి.రాఘవ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు మహేష్ వి. రాఘవ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరికి కోసం స్క్రిప్ట్‏ను కూడా రెడీ చేసాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుండగా.. ఇందులో రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మారెడుపల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే విజయ్ దేవరకొండ కూడా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇటివలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషస్పందన లభించింది. ఇక తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత విజయ్, బన్నీ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:

Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..