Squid Game2: ప్రాణాలు తీసే భయంకర ఆట మళ్లీ వస్తోంది.. స్క్విడ్ గేమ్‌2 ఎప్పుడంటే

ఇదిలా ఇప్పుడీ సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది. స్క్విడ్ గేమ్‌2 పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ డిసెంబర్‌ 26వ తేదీ నంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించగా తాజాగా ఈ సిరీస్ టీజర్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. సోషల్‌ మీడియాల వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. స్క్విడ్ గేమ్‌ సీజన్‌2...

Squid Game2: ప్రాణాలు తీసే భయంకర ఆట మళ్లీ వస్తోంది.. స్క్విడ్ గేమ్‌2 ఎప్పుడంటే
Squid Game2
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2024 | 11:35 AM

స్క్విడ్‌ గేమ్‌.. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2021లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. వ్యూయర్‌షిప్‌ పరంగా సరికొత్త రికార్డులను తిరగరాసిందీ సిరీస్‌. నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధిక మంచి వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్‌కు ఏకంగా 1.65 బిలియ‌న్ల స్ట్రీమింగ్ వ్యూ రావడం గమనార్హం.

ఇదిలా ఇప్పుడీ సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది. స్క్విడ్ గేమ్‌2 పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ డిసెంబర్‌ 26వ తేదీ నంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించగా తాజాగా ఈ సిరీస్ టీజర్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. సోషల్‌ మీడియాల వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. స్క్విడ్ గేమ్‌ సీజన్‌2 టీజర్‌ను గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌పై అప్పుడే బజ్‌ మొదలైంది.

‘ది గేమ్‌ విల్ నాట్ స్టాప్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రెడీ ఫ‌ర్ ది నెక్స్ట్ లెవెల్ అంటూ పోస్ట‌ర్‌కు నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన క్యాప్ష‌న్ సిరీస్‌పై ఉన్న హైప్‌ను మ‌రింత పెంచేసింది. దీంతో ఈ సీజన్‌లో గేమ్స్‌ ఇంకెంత భయంకరంగా ఉంటాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సీజన్‌లో లీ జంగ్ జే, వి హ జూన్‌, గాంగ్ యో కీతో పాటు ప‌లువురు కొరియ‌న్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఇంతకీ ఏంటీ వెబ్‌ సిరీస్‌..

స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌ కథ విషయానికొస్తే.. అప్పులతో ఇబ్బందులు పడుతోన్న కొందరిని ఈ గేమ్‌ నిర్వాహకులు ప్రపంచంతో సంబంధం లేని ఒక దీవికి తీసుకెళ్తారు. అక్కడ రకరకాల గేమ్స్‌ను ఆడిస్తూ అందులో ఓడిపోయిన వారిని చంపేస్తారు. చివరికి మిగిలిన వ్యక్తికి ప్రైజ్‌ మనీని అందజేస్తారు. అయితే ఇదే సమయంలో అసలు ఈ గేమ్‌ను ఎవరు నిర్వహిస్తున్నారన్న అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే సీజన్‌1లో గెలిచిన వ్యక్తి, ఆ ముఠాను కచ్చితంగా పట్టుకుంటానని చెప్పడంతో సీజన్‌1 ముగుస్తుంది. దీంతో సీజన్‌2 మరింత ఆసక్తికరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మరి స్క్విడ్‌ గేమ్‌ నిర్వాహకులను హీరో పట్టుకుంటాడా.? ఈ సీజన్‌లో ఎలాంటి గేమ్స్‌ ఉంటాయి లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సీజన్‌2లో మొత్తం 9 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..