Video:పెళ్లిల్లో వధువు ముందే అమ్మాయిలతో వరుడు డ్యాన్స్.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..
ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు.. తమ పెళ్లి వేడుకలో కొత్త భాగస్వామిని మెప్పించేందుకు డ్యాన్స్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ప్రస్తతం ప్రతి పెళ్లిలో ఇదే తంతు కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ఈ వీడియోలో వరుడు కొంత మంది అమ్మాయిలతో కలిసి షారుఖ్ పాటకు డ్యాన్స్ చేసి వధువును మెప్పించాడు. అతడి పార్ఫామెన్స్ చూసి కొత్త పెళ్లి కూతురు ఫిదా అయిపోయింది.

ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు.. తమ పెళ్లి వేడుకలో కొత్త భాగస్వామిని మెప్పించేందుకు డ్యాన్స్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ప్రస్తతం ప్రతి పెళ్లిలో ఇదే తంతు కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ఈ వీడియో నెటిజన్లను భలే ఆకట్టుకుంది. వైరల్ వీడియో ప్రకారం.. వధూవరులు వేదికపై కూర్చుని ఉండగా.. ఫుల్ స్వాగ్‌లో ఉన్న నలుగు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. అందులో ఒకరు.. పెళ్లి కొకును చూపిస్తూ..ఈ వ్యక్తంటే నాకు ఇష్టం అని.. చెప్పి అతని చేతు పట్టుకొని అక్కడి నుంచి కిందకు తీసుకెళ్లింది.
ఆ వెంటనే నలుగురు అమ్మాయిలు పెళ్లి కొడుకును చుట్టు ముట్టారు. అప్పుడే షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా అయినా బాద్షా లోని వో లడ్కీ జో సబ్సే అలగ్ హై అనే సాంగ్ ప్లే అయింది. దీంతో ఆ వరుడు వారిలో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. పెళ్లికూతురు సహా అక్కడున్న బంధువులంతా పెళ్లికొడుకు పర్ఫామెన్స్ చూసి స్టన్ అయ్యారు. వరుడి డ్యాన్స్ చూసి వధువు మొదట ఆశ్చర్యపోతుంది, కానీ తరువాత ఉత్సాహంగా మాట్లాడుతూ పొగడ్తలతో అతన్ని ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
