Singer Chinmayi: ఆ విషయంపై మా అమ్మను ఇబ్బంది పెట్టకండి.. సోషల్ మీడియాలో చిన్మయి ఇంట్రెస్టింగ్ పోస్ట్..
డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada).
డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). ఇక సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులను మీటూ ఉద్యమం (MeToo Movement) ద్వారా ధైర్యంగా బహిర్గతం చేసి వార్తల్లో నిలించారు. ఆమె స్ఫూ్ర్తితోనే సినిమా పరిశ్రమలో ఎంతోమంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కాగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే చిన్మయి అందులో మహిళా సమస్యలను తరచూ ప్రస్తావిస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా తమ ఇబ్బందులను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. ఈ విషయంలో అబ్బాయిలు కూడా చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే తమ వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై చిన్మయితో చర్చించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలువురు చిన్మయి వాళ్లమ్మకు ఫోన్లు చేయడం ప్రారంభించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన సింగర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘వృత్తిపరమైన, వ్యక్తిగత అంశాల విషయంలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే.. మా అమ్మకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టకండి. ఆమె నా స్పోక్స్ పర్సన్ కాదు. నేను సోషల్‌మీడియాలో ఏం పెట్టినా మా అమ్మకు వాటితో ఎలాంటి సంబంధం లేదు. మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే నేరుగా మా మేనేజర్‌కి కాల్ చేయండి’ అని సూచించింది చిన్మయి.
View this post on Instagram
Hero Surya : తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది ఆయన సినిమాలే.. ఆసక్తికర కామెట్స్ చేసిన సూర్య
Viral Photos: హాలీవుడ్ హల్క్ సినిమా చూశారా.. ఇప్పుడు నిజ జీవితంలో హల్క్‌ని చూడండి..!