Hero Surya : తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది ఆయన సినిమాలే.. ఆసక్తికర కామెట్స్ చేసిన సూర్య

విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని అన్నారు హీరో సూర్య. సూర్య మాట్లాడుతూ.. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు.

Hero Surya : తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది ఆయన సినిమాలే.. ఆసక్తికర కామెట్స్ చేసిన సూర్య
Surya
Follow us

|

Updated on: Mar 05, 2022 | 7:40 PM

Hero Surya: విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని అన్నారు హీరో సూర్య. సూర్య మాట్లాడుతూ.. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు. ఈ.టీ(ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య  సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

సూర్య మాట్లాడుతూ.. పాండమిక్ ప్రతి ఒక్కరి ఆలోచనలను మార్చేసింది. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది తెలిపింది. నా బంధువులు కూడా తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి జూమ్లో మాట్లాడుకునేవారు. ఇక యూత్ లైఫ్ను మార్చేసింది. పెండ్లిండ్లు కూడా విదేశాల్లో కాకుండా ఇక్కడే చేసుకొనేలా పరిస్థితులు కల్పించింది అన్నారు.  అదేవిధంగా నా మిత్రుడు మాధవన్ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ తన కొడుక్కి స్విమ్మింగ్ నేర్పించాడు. కుటుంబానికి చాలా సమయం కేటాయించాడు. చాలామంది నా బంధువులు, స్నేహితులు కూడా స్వచ్ఛమైన వాతావరణం కోసం రిమోట్ ఏరియాకు వెళ్ళి హాయిగా ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నారు. నా కుటుంబ సభ్యుల్లో కొందరు కొడైకెనాల్ వెళితే, మరికొందరు గోవా వెళ్ళారు.

పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు ఏడాదిన్నర కాలం చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సైకిల్ షాప్ ఓనర్ రెండున్నర ఏళ్ళు ఒక సైకిల్ కూడా అమ్మలేదట. ఆ తర్వాత మూడు నెలల్లో ఆఫర్లు వస్తే అమ్మడానికి సరుకులేదు. ఇలా వైవిధ్యమైన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఆదరణ పొందాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. డిజిటల్ బినిజెన్ నిర్మాతలకు బూస్ట్ ఇచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత పుష్ప, భీమ్లానాయక్ కూడా థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా సినిమాలు పెద్ద వ్యాపారం జరిగేలా పరిస్థితులు అనుకూలించాయి.

డిజిటల్లో అల్లు అరవింద్ గారికి చెందిన ఆహా! ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చేలా చేసింది.రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో కొత్త కంటెంట్లు అందరూ చూసి ఆనందిస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది.  ఢిల్లీ నుంచి ముంబై వరకు పలు పొడ్రక్షన్ కంపెనీలు విస్తృతం అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్లో కొత్త ప్రక్రియ వచ్చేసింది. ఫాంటసీ సినిమాలేకాదు కంటెంట్ సినిమాలకు యూత్ పెద్ద పీట వేస్తున్నారు. విప్లవాత్మకమైన ఈ మార్పులు మరింత పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మంచి సినిమాలు వస్తే శుక్ర, శనివారం, ఆదివారం యూత్ బాగా చూస్తున్నారు. దీంతో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు.

ఒక్కొక్కరు ఆర్టిస్టుగా ఏం చేయాలనేది గ్రహించారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్ను తీసుకువచ్చింది. తమిళనాడులో 8కోట్ల జనాభా వుంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఇ.టి. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. మా 2డి ఎంటర్టైన్ మెంట్ బేనర్పై కార్తీతో పాండిరాజ్ సినిమా తీశాడు. అది చినబాబుగా తెలుగులో వచ్చింది. పాండిరాజ్ ఫ్యామిలీ సినిమాలు బాగా తీస్తాడు. ఆ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూసి చాలా బాగుందని ట్వీట్ కూడా చేశారు. ఈటీలో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని  దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఇ.టి సినిమా. మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.

రాజమౌళి, ఆయన ఫాదర్ విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఇ.టి.లోనూ విలన్  సరికొత్తగా వుంటాడు. ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇప్పటి జనరేషన్ కూడా బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. నా అభిమానులు కూడా నా కథలు, నన్ను బాగా ఫాలో అవుతున్నారు. వారికి మెప్పించే సినిమా ఈటీ.  జై భీమ్ అనేది ఆస్కార్కు వెళ్ళింది. అవార్డుకు వెళ్ళిన ఏ సినిమా అయినా యు.ఎస్.లోని మూడు రాష్ట్రాలలో ఆడాలి. కానీ కరోనా వల్ల ఓటీటీకూడా తీసుకుంటున్నారనే లాజిక్తో మేం వెళ్ళాం. చాలామంది మెచ్చుకున్నారు. దాదాపు 3వేల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో వుంటుంది. తమిళంలో కూడా ఇలా వుంటే వెరైటీగా వుంటుందని దర్శకుడు చెప్పారు. చిన్న చిన్న డైలాగ్లు చిన్న చిన్న మార్పులు చేశాం అని చెప్పుకొచ్చారు సూర్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!