F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!

సక్సెస్ ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. తనదైన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సక్సెస్ లు సాధిస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్.

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!
F3
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2022 | 4:34 PM

F3 Movie : సక్సెస్ ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. తనదైన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సక్సెస్ లు సాధిస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్. పటాస్ సినిమాతో మొదలు పెట్టిన తన జర్నీని సరిలేరు నీకెవ్వరు వరకు సక్సెస్ ఫుల్ గా సాగించారు అనిల్. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తెరకెక్కించాడు అనిల్. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత  దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చేస్తున్నాడు. ఈ సినిమా వెంకటేష్, వరుణ్ తోపాటు సునీల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవ్వడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. గతంలో సినిమా రిలీజ్ వాయిదా పడిందన్న విషయాన్ని నాగరత్తమ్మ అనే క్యారెక్టర్ తో ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు. తాజాగా మరో సారి అదే క్యారెక్టర్ తో మరో వీడియోను వదిలారు. `ఎఫ్ 3` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గరికి వెళ్లి సినిమా గురించి కనుక్కోవడం.. అలాగే సరదాగా మాట్లాడుకుంటున్న హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్లి వాళ్లకు బుట్ట మామిడి పళ్ళు ఇస్తానని.. అలాగే ఆడవాళ్ల కోసం ఓ ఆసనం వేయాలని అడగడం దాంతో అక్కడి నుంచి వరుణ్ , వెంకీ జంప్ అవ్వడం చూపించారు. వెంకటేష్- వరుణ్ తేజ్ – అనిల్ రావిపూడితో కలిసి సునయన నాగ రత్తమ్మగా నవ్వులు పూయించిన ఈ వీడియో తెగ వైరాల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఈ చిన్నారితో కథ వేరుంటది.. అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Iswarya Menon: సంద్రంలో జలకన్యలా మెళికలు తిరుగుతున్న ‘ఐశ్యర్య మీనన్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…

RRR: చిక్కుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా.. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరిక..