Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..
Samantha

వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా ప్రొఫెషనల్‌ లైఫ్‌ పరంగా మాత్రం జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్లుతోంది సమంత (Samantha). విడాకుల వ్యవహారం తర్వాత కెరీర్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టిన సామ్‌ వరుసగా సినిమాలకు సైన్‌ చేసింది.

Basha Shek

|

Mar 05, 2022 | 4:55 PM

వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా ప్రొఫెషనల్‌ లైఫ్‌ పరంగా మాత్రం జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్లుతోంది సమంత (Samantha). విడాకుల వ్యవహారం తర్వాత కెరీర్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టిన సామ్‌ వరుసగా సినిమాలకు సైన్‌ చేసింది. మరోవైపు పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తోనూ మెప్పించింది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంత‌లం, య‌శోద సినిమాల‌తో పాటు త‌మిళంలో విజ‌య్ సేతుపతి హీరోగా న‌టిస్తున్న క‌తువాకుల రెండు కాద‌ల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గ‌త‌కొన్ని రోజులు నుంచి స‌మంత, టాలీవుడ్‌ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్నట్లు ఫిల్మ్‌ సర్కిల్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. మజిలీ, నిన్నుకోరి, టక్‌ జగదీష్‌ లాంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్ర రూపొందనుందని తెలుస్తోంది. పుష్పలాంటి పాన్‌ ఇండియాను అందించిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఆ చిత్రానికి సంబంధించిన మ‌రో వార్త నెట్టింట్లో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రానికి గానూ సామ్‌ రూ. 3 కోట్ల వ‌ర‌కు రెమ్యురేష‌న్‌ను డిమాండ్ చేస్తుందట‌. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా స‌మంత అడిగిన‌ పారితోష‌కాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట.

కాగా గతంలో పుష్పలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం సమంత రూ.1.5కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన రెమ్యునరేషన్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది సామ్‌. కాగా తమకున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా తాజాగా ఒక సినిమాకు సుమారు రూ.3.5 కోట్లు, శ్రీవల్లి రష్మిక కూడా రూ. 3కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సామ్‌ విషయానికొస్తే త్వరలో.. త్వరలో ఆమె నటించిన క‌తువాకుల రెండు కాద‌ల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. దీనికి సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్‌ డ్రామా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.

Also Read:Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..

Attention Students! CISCE టర్మ్ 2 పరీక్షల తేదీల్లో మార్పులు.. మ్యాథ్స్‌, జియోగ్రఫీ పరీక్షలు ఈ తేదీల్లోనే..

Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu