AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rainbow Hospital: రెయిన్‌బో హాస్పిటల్‌, మహేష్‌ బాబు సంయుక్తంగా ‘ప్యూర్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’.. చిన్నారుల కోసం మరో ముందడుగు..

మహేష్ బాబు సినిమాల్లోనే సూపర్ స్టార్ కాదు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టారే.. తన  నటనతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు.

Rainbow Hospital: రెయిన్‌బో హాస్పిటల్‌, మహేష్‌ బాబు సంయుక్తంగా 'ప్యూర్‌ హార్ట్‌ ఫౌండేషన్‌'.. చిన్నారుల కోసం మరో ముందడుగు..
Mahesh Babu
Rajeev Rayala
| Edited By: Narender Vaitla|

Updated on: Mar 05, 2022 | 10:22 PM

Share

Pure Little Hearts Foundation: హృద్రోగాలతో బాధపడే చిన్నారుల కోసం రెయిన్‌ బో ఆసుపత్రి యాజమాన్యం తన సహాయాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ రెయిన్‌బో హాస్పిటల్‌, ఎంబీ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ప్యూర్‌ లిటిల్ హార్ట్స్’ ఫౌండేషన్‌ ప్రారంభించారు. శనివారం బంజారహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో మహేష్‌ బాబు లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌ లోగోను ఆవిష్కరించారు. అంతకు ముందు ఆసుపత్రి వైద్యులు చైర్మన్ కే రమేష్, నాగేశ్వరరావులతో కలిసి మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా మహేష్‌ బాబు మాట్లాడుతూ.. రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి తన జీఎంబీ ఫౌండేషన్‌ పనిచేస్తుందన్నారు. చిన్న పిల్లల గుండె సమస్యల పట్ల రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చేస్తున్న వైద్య సేవలను మహేష్ బాబు ప్రశంసించారు. రెయిన్‌బో హాస్పిటల్‌తో తన అనుబంధం కొనసాగుతుందన్నారు. గుండె ఆపరేషన్లకు స్తొమత లేని కుటుంబాలకు రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ తగిన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఇక చిన్నపిల్లలంటే తనకు ఇష్టమన్నారు. గుండె సంబంధిత వ్యాధుల బారిన బడిన ఎంతో మంది చిన్నారులకు తమ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించామన్నారు. భవిష్యత్తుల్లోనూ ఈ సేవలను కొనసాగిస్తామని మహేష్‌ తెలిపారు.

ఇక రెయిన్‌బో ఆసుపత్రి చైర్మన్‌ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ ఆసుపత్రి అందించని విధంగా వైద్య సదుపాయాలను రెయిన్‌బో అందిస్తుందని ఆయన తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్య కేంద్రంలో రెయిన్‌బో ఒకటన్నారు. లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ప్రారంభ సమయంలో రమేష్‌ రెడ్డి సొంతంగా రూ. కోటి అందచేశారు. ప్రతీ ఏటా రూ. 50 లక్షల చొప్పున రానున్న ఐదేళ్లు అందించనున్నట్లు ప్రకటించారు.

Also Read: Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!