Prabhas: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ప్రభాస్.. ఏమన్నాడంటే

Prabhas: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ప్రభాస్.. ఏమన్నాడంటే
Prabhas

కూల్ అండ్ కామ్ ఉండే ప్రభాస్ తాజాగా ఓ పంచ్‌ ఇచ్చారు. రీసెంట్గా జరిగిన రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నను చాలా క్యాజువల్‌గా తిప్పికొట్టారు

Rajeev Rayala

|

Mar 05, 2022 | 5:34 PM

Prabhas: కూల్ అండ్ కామ్ ఉండే ప్రభాస్ తాజాగా ఓ పంచ్‌ ఇచ్చారు. రీసెంట్గా జరిగిన రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నను చాలా క్యాజువల్‌గా తిప్పికొట్టారు. మీ ప్రశ్న తప్పని చెప్పకుండా.. అలా ఆలోచించడం మానుకోండని నేరుగా అనకుండా.. ఇంకో సారి.. ఎవరూ అలాంటి ప్రశ్న అడగకుండా.. విత్ ఎక్జామ్‌పుల్ మాట్లాడేశారు.. అందర్నీ ఫిదా చేశారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటనే గా మీ డౌట్‌.. అసలు విషయం ఏంటంటే..పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్‌తో మరికొన్ని రోజుల్లో హడావిడి చేయనున్న ప్రభాస్.. తాజాగా చెన్నైలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేశారు.  ఈ ఈవెంట్ త్రూ మరో సారి రాధేశ్యామ్ మ్యాజిక్ ను ఇండియా వైడ్ స్ప్రెడ్ చేసి.. ఓపెనింగ్ కలెక్షన్లో నయా రికార్డులు క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే మీడియా గ్యాథరింగ్‌ ను ఏర్పాటు చేసి వారు అడిగిన ప్రశ్నలకు కూల్ అండ్ కామ్‌గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు మన డార్లింగ్.

చాలా మంది సౌత్ ఇండియన్ ఫిల్మ్ నుంచి నార్త ఇండియన్‌ ఫిల్మ్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. మరి మీ ఫీలింగ్ ఏంటి? ” అని ఓ రిపోర్టర్ తన వంతు రాగానే డార్లింగ్ ను అడిగేశారు. ఇక ఆ ప్రశ్నకు డార్లింగ్ ప్రభాస్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. “చైనాలో సినిమాలను చైనీస్ ఫిల్మ్స్‌ అంటారు. ఇంగ్లీష్ సినిమాలను హాలీవుడ్‌ ఫిల్స్మ్‌ అంటారు. కానీ ఇండియాలో సినిమాలను మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్స్… నార్త్‌ ఇండియన్ ఫిల్మ్స్ అని ఎందుకు విడగొడతారు” అంటూ ఆ రిపోర్టర్ కే కౌంటర్ ఇచ్చారు. ఈ ఆన్సర్‌ తో నెట్టింట ప్రో.. బాస్ అనే మీమ్‌తో వైరల్ అవుతున్నారు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu